Libya floods: ఎక్కడ చూసినా మృతదేహాలే.. లిబియాలో భయానక దృశ్యాలు

డేనియల్ తుపానుతో వరదలు తీవ్ర బీభత్సం సృష్టించింది. లిబియాలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వానలు కురిశాయి. ఈ వరదల కారణంగా లిబియాలోని డెర్నా నగరంలో సగంవంతు కొట్టుకుపోయింది. అంతేకాకుండా సుమారు 20 వేల మంది మరణించి ఉండొచ్చని మేయర్ వెల్లడించారు.

New Update
Libya floods: ఎక్కడ చూసినా మృతదేహాలే.. లిబియాలో భయానక దృశ్యాలు

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా..

డెర్నా నగర వీధులు, సముద్ర తీరం నదీ ఒడ్డున ఎక్కడ చూసినా మృతదేహాలు కనిపిస్తున్నాయి. చెల్లాచెదురుగా పడి ఉన్న శవాలను చూస్తే ప్రాణం చలించిపోతోంది. డేనియల్‌ తుపాను (Storm Daniel) సృష్టించిన జలప్రళయంతో లిబియాలోని డెర్నా (Derna) నగరంలో ఇప్పటికీ భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. నివాస ప్రాంతాలు, వీధుల్లో ఎటుచూసినా బురద మేటలుతో నిండి ఉంది. వాటి కింద శవాలు గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. మరోవైపు సముద్ర జలాల నుంచి ఆధిక సంఖ్యలో మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి. శుక్రవారం (నిన్న) ఈ నగరంలో 11 వేలకుపైగా మరణించారని అధికారులు ప్రకటించాaరు. గల్లంతైన మరో 10 వేలకుపైగా ఆచూకీ ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు. అయితే వారంతా మరణించి ఉండొచ్చన్న ఆందోళనలు వ్యక్తం అమవుతున్నాయి. 20 వేలకుపైనే మృతుల సంఖ్య ఉండొచ్చని అధికారులు ఇప్పటికే అనధికారికంగా తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతదేహాలు, గల్లంతైనవారి కోసం అన్వేషించేందుకు వీలుగా శుక్రవారం డెర్నా నగరాన్ని అధికారులు మూసివేశారు. ప్రజలను బయటకు తరలించి.. సహాయక బృందాలతో బురద మేటలను తొలగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. దీంతోపాటు ధ్వంసమైన ఇళ్ల కింద చిక్కుకుపోయిన వారి కోసం గాలింపును ముమ్మరం చేస్తున్నారు.

పేలుడు పదార్థాల భయం

డెర్నాలో ఇప్పటికే మృతుల సంఖ్య ఆధిక సంఖ్యలో ఉంది. మరో ఆందోళనకర అంశం అధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది. లిబియాలో 2011 నుంచి అంతర్గత ఘర్షణలు కొనసాగుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మందుపాతరలు పాతిపెట్టినట్లు తెలుస్తోంది. దీంతోపాటు రెండో ప్రపంచ యుద్ధం నాటి పేలుడు పదార్థాలు లిబియాలో ఉన్నట్లు అనుమాలు వ్యక్తం చేస్తున్నారు. ఇవి వరద నీటిలో కొట్టుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. అంతేకాదు సహాయక చర్యలు చేపట్టేటప్పుడు అవి పేలితే ప్రాణ నష్టం మరింత పెరగొచ్చని నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు.

ప్రతీ ఇంటిలో విషాదం

డెర్నాలో 90 వేల జనాభా ఉండగా.. ఈ వరదలకు వేలమంది గల్లంతయ్యారు. వీధులు, శిథిలమైన భవనాలు, సముద్ర తీరాలు, నదులు సమీపంలో మృతదేహాలను సహాయక బృందాలు వెలికి తీసుకున్నారు.కుప్పలుకుప్పలుగా కనిపిస్తున్నాయి. డేనియల్ తుపాన్ ధాటికి అంతర్గత మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబు లమౌషా వెల్లడించారు. దీంతో డెర్నా నగరం భారీ ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగింది. ఈ మహా విళయానికి ఆ నగరంలో ప్రతీ ఇంటిలో విషాదం మిగిల్చింది.

Also Read: యువరాణి డయానా ధరించిన స్వెటర్..ఎన్నికోట్లకు అమ్ముడుపోయిందో తెలుస్తే షాక్ అవుతారు..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు