Trump: మరో చర్చకు సిద్ధమా బిడెన్..సవాలు విసిరిన ట్రంప్!

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు జో బిడెన్‌కు సవాల్ విసిరారు.గతంలో జరిగిన చర్చలో ట్రంప్ వేసిన ప్రశ్నలకు బిడెన్ సమాధానం చెప్పలేక తడబడ్డారు.అయితే ఫ్లోరిడాలో జరిగిన ప్రచార సభలో మరోసారి చర్చకు సిద్ధమా ఉంటూ బిడెన్‌కు,ట్రంప్ సవాల్ విసిరారు.

New Update
Trump: మరో చర్చకు సిద్ధమా బిడెన్..సవాలు విసిరిన ట్రంప్!

US Presidential Election: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధ్యక్షుడు జో బిడెన్‌కు (Joe Biden) మరోసారి సవాల్ విసిరారు.నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్ (81) అధికార డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (78) ఆయనపై పోటీ చేస్తున్నారు. బిడెన్  ట్రంప్ పాల్గొన్న బహిరంగ చర్చ 27వ తేదీన జరిగింది.

ట్రంప్ ప్రశ్నలకు బిడెన్ సమాధానం చెప్పలేకపోయాడు. తదనంతరం, జో బిడెన్‌ను అధ్యక్ష అభ్యర్థిగా భర్తీ చేయాలని ఆయన పార్టీ సభ్యులు వాపోయారు. అయితే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.ఈ సందర్భంలో, ఫ్లోరిడాలో జరిగిన ప్రచార సభలో మాట్లాడిన ట్రంప్, మరోసారి ముఖాముఖి కలవడానికి సిద్ధంగా ఉన్నానని బిడెన్‌కు సవాలు విసిరారు.

నేను జో బిడెన్‌కు ప్రపంచం ముందు తనను తాను నిరూపించుకోవటానికి మరొక అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మేము ఈ వారంలో మరొక సారి చర్చలో పాల్గొనటానికి నేను రెడీగా ఉన్నాను. కానీ ఈసారి, మా ఇద్దరి మధ్య చర్చ ప్రేక్షకులు లేదా మధ్యవర్తులు లేకుండా జరగాలి. ఎప్పుడు, ఎక్కడ జరగాలో బిడెన్ పక్షం నిర్ణయించనివ్వండని ట్రంప్ అన్నారు.
అలాగే అతనితో ‘గోల్ఫ్‌’ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాను. ఇందులో, బిడెన్ గెలిస్తే, నేను అతనికి నచ్చిన స్వచ్ఛంద సంస్థకు ఒక మిలియన్ US డాలర్లను విరాళంగా ఇస్తానని ట్రంప్ అన్నారు.

Also Read: మాజీ అగ్నివీర్‌లకు గుడ్ న్యూస్.. CISF-BSFలో రిజర్వ్ కానిస్టేబుల్ పోస్టులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు