Gender Equality Lessons: లింగ సమానత్వంపై పిల్లలకు పాఠాలు

విద్యార్థి దశ నుంచే లింగ సమానత్వ భావనను బలంగా నాటేందుకు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల పాఠ్యపుస్తకాల్లో లింగ సమానత్వాన్ని చేర్చింది. వేసవి సెలవుల విరామం అనంతరం సోమవారం నుంచి కేరళలో పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి.

New Update
Gender Equality Lessons: లింగ సమానత్వంపై పిల్లలకు పాఠాలు

Gender Equality Lessons: కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థి దశ నుంచే లింగ సమానత్వ భావనను బలంగా నాటేందుకు వినూత్న ప్రయత్నం చేసింది. పిల్లల పాఠ్యపుస్తకాల్లో లింగ సమానత్వాన్ని పాఠాలను చేర్చేందుకు సిద్ధమైంది. వేసవి సెలవుల విరామం అనంతరం సోమవారం నుంచి కేరళలో పాఠశాలలు పునః ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా అందుబాటులోకి తెచ్చిన పాఠ్యపుస్తకాల్లో వంట, ఇతర ఇంటి పనుల్లో లింగ భేదానికి తావులేకుండా కుటుంబ సభ్యులంతా కలిసి అన్ని పనులూ చేస్తున్న చిత్రం అందరినీ విశేషంగా ఆకర్షించింది.

మళయాళం మీడియం మూడో తరగతి పాఠ్యపుస్తకంలో లింగ సమానత్వాన్ని సూచిస్తున్న పాఠంలోని ఈ చిత్రాన్ని విద్యాశాఖ మంత్రి వి. శివన కుట్టి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిలో తండ్రి వంటగదిలో కూర్చుని కొబ్బరి తురుముతుంటే.. తల్లి వంట చేస్తూ కనిపిస్తోంది. ఇక కేరళ ప్రభుత్వం ఇలా ఇంగ్లిష్ పాఠ్యపుస్తకాల్లో పొందుపర్చిన లింగ సమానత్వం భావనను ఉపాధ్యాయులు, విద్యార్థులు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు. మరోవైపు విద్యార్థులు రేబిస్ వ్యాధి బారిన పడకుండా నిరోధించేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పాఠశాల ఆవరణలో వీధి కుక్కలు ఉండ కుండా, అక్కడ అవి సంతానోత్పత్తి చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు