Mahanandi: మహానంది క్షేత్రంలో మళ్లీ చిరుత కలకలం!

మహానంది క్షేత్రంలో మరోసారి చిరుత కలకలం రేపింది. క్షేత్రంలోని అన్నదాన సత్రం వద్దకు వచ్చి కుక్కను చిరుత లాక్కొని వెళ్లింది. చిరుతను చూసి ఆలయ సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు

New Update
Mahanandi: మహానందిలో మరోసారి చిరుత సంచారం!

Mahanandi: మహానంది క్షేత్రంలో మరోసారి చిరుత కలకలం రేపింది. క్షేత్రంలోని అన్నదాన సత్రం వద్దకు వచ్చి కుక్కను చిరుత లాక్కొని వెళ్లింది. చిరుతను చూసి ఆలయ సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. చిరుత సంచరిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని ఆలయ అధికారులు ముందుగానే మైకుల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

పెంపుడు జంతువులను స్వేచ్ఛగా వదిలేయవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.ఆదివారం కూడా మహానంది క్షేత్రం పరిసరాల్లో చిరుత హల్ చల్ చేసింది. ఆలయ ఈవో పక్కన ఉన్న విద్యుత్ కార్యాలయం వద్ద చిరుత సంచరించినట్లు అధికారులు ఆనవాళ్లు గుర్తించారు. ఆదివారం అడవిలో నుంచి క్షేత్ర పరిసరాల్లోకి చిరుత ప్రవేశించి విద్యుత్ కార్యాలయం వద్దకు వచ్చినట్లు తెలుస్తుంది. కుక్కలు భయంతో గట్టిగా మొరగడంతో విద్యుత్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు.

స్థానికులు , విద్యుత్ సిబ్బంది కేకలు, విజిల్స్ వేయడంతో చిరుత అడవిలోకి పారిపోయింది. భక్తులు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇదిలా ఉండగా.. మళ్లీ చిరుత వచ్చి కుక్కను చంపేయడంతో ఆలయ సిబ్బంది, భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. కారణమేదైనా పుణ్యక్షేత్రంలో క్రూరమృగాల సంచారం ఇటు భక్తులను, అటు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Also read:తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్‌.. నేటి నుంచి ఆర్జిత సేవల కోటా టికెట్ల విడుదల..!

Advertisment
తాజా కథనాలు