/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/leopard-jpg.webp)
Leopard Head Stuck In Vessel: పాపం చిరుతపులి.. ఎండకు నీళ్లకోసం ప్రయత్నించిందో.. లేకపోతే అదేమిటో చూద్దాం అని అనుకుందో కానీ ఇత్తడి బిందెలో తల పెట్టింది. అంతే.. అది కాస్తా ఇరుక్కుపోయింది. దీంతో తలను బయటకు తీసుకోవడానికి అవస్థలు పడీ.. పడీ.. చివకు అలిసిపోయి అలానే ఉండిపోయింది. ఈ సంఘటన మహారాష్ట్రాలోని (Maharashtra) ధూల్ జిల్లాలో చోటు చేసుకుంది. అలసి బిందెలో ఇరుక్కుపోయిన తలతో ఓ పక్కగా పడి ఉన్న చిరుతను స్థానికులు చూసి, విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు చెప్పారు. దీంతో అటవీశాఖ అధికారులు సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. అక్కడ చిరుత పరిస్థితి చూసి వెంటనే దానిని రక్షించే పని మొదలు పెట్టారు.
చిరుత(Leopard)ను రక్షించడం కోసం ముందుగా దానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. తరువాత ఆ బిందెను చిరుత తలా నుంచి తపించడానికి ప్రయత్నించారు. ఎంత ప్రయత్నం చేసినా సరే.. ఆ బిందె నుంచి చిరుత తలను బయటకు లాగడం వీలు పడలేదు. ఇక బిందెను కోసివేయడమే సరైన పని భావించారు. మిషెన్ తెప్పించి.. జాగ్రత్తగా ఇండెను కోసి.. చిరుత తలను తప్పించారు.
Also Read: ఇల్లంత లిఫ్ట్..ప్రపంచంలోనే అత్యంత పెద్దది..ముంబయ్ వరల్డ్ జియో సెంటర్‌లో
సుమారు ఐదు గంటల పాటు చిరుత తల బిందెలో ఇరుక్కుని ఉండిపోయిందని ఆపరేషన్ కు నేతృత్వం వహించిన ఆర్‌ఎఫ్‌ఓ సవిత సోనావనే (Savita Sonawane) తెలిపారు. చిరుత మంచినీళ్ల కోసం బిందెలో తల పెట్టి ఉంటుందని ఆయన చెప్పారు. కొద్దిగా రిస్క్ ఉన్నా.. మెషిన్ సహాయంతో విజయవంతంగా చిరుతను రక్షించామని వెల్లడించారు.
బిందెలో తలపెట్టి ఇరుక్కున్న చిరుత
మహారాష్ట్ర - ధూలె జిల్లాలోని ఓ గ్రామంలోకి ప్రవేశించిన చిరుత నీరు తాగడానికి బిందెలో తల పెట్టగా అందులో ఇరుక్కుపోయింది.
చివరికి ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకొని చిరుతకు మత్తుమందు ఇచ్చి బిందెను కట్ చేసి చిరుతను రక్షించారు. pic.twitter.com/IzqclOkIWF
— Telugu Scribe (@TeluguScribe) March 4, 2024