Leopard Attack: నంద్యాల జిల్లాలో రైల్వే కూలీలపై చిరుతపులి దాడి

AP: నంద్యాల జిల్లాలో రైల్వే కూలీలపై చిరుతపులి దాడి చేసింది. మహానంది మండలం గాజులపల్లె శివారు చలమలో చిరుత పులి పిల్ల సంచారం చేస్తోంది. చిరుత దాడిలో ఛత్తిస్‌గఢ్‌కు చెందిన పాండన్‌ అనే మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి.

Leopard Attack: నంద్యాల జిల్లాలో రైల్వే కూలీలపై చిరుతపులి దాడి
New Update

Leopard Attack in Nandyala: నంద్యాల జిల్లాలో రైల్వే కూలీలపై చిరుతపులి దాడి చేసింది. మహానంది మండలం గాజులపల్లె శివారు చలమలో చిరుత పులి పిల్ల సంచారం చేస్తోంది. చిరుత దాడిలో ఛత్తిస్‌గఢ్‌కు చెందిన పాండన్‌ అనే మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ప్రమాద స్థలానికి చేరుకొని పులి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. గాయమైన మహిళను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. కాగా పులిసంచారంతో అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. పనులకు వెళ్లాలంటే బయపడుతున్నారు. ఈ పులుల భారీ నుంచి తమను రక్షించాలని అటవీశాఖ అధికారాలను వేడుకుంటున్నారు.

Also Read: ఊరుకునేది లేదు.. చంద్రబాబు హెచ్చరికలు

#leopard-attack
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe