Kapil Dev: కిడ్నాప్ అయిన దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్.. గంభీర్ పోస్ట్ వైరల్ భారత దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ కిడ్నాప్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను మరో మాజీ క్రికెటర్ ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ ట్విట్టర్(ఎక్స్)లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా ఆందోళనకు గురవుతున్నారు. By BalaMurali Krishna 25 Sep 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Kapil Dev: భారత దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ కిడ్నాప్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను మరో మాజీ క్రికెటర్ ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ ట్విట్టర్(ఎక్స్)లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా ఆందోళనకు గురవుతున్నారు. కపిల్‌కు ఏమైందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు కపిల్ నోటిని కర్చీఫ్‌తో కట్టేసి బలవంతంగా ఓ గదిలోకి తీసుకెళ్తున్నారు. రక్షించండి అంటూ కపిల్ భయంగా వెనక్కి తిరిగారు. ఈ వీడియోను షేర్ చేసిన గంభీర్ "ఈ వీడియో నాకే వచ్చిందా..? ఇంకెవరికైనా వచ్చిందా..? అందులో ఉన్నది నిజమైన కపిల్ దేవ్ కాదని అనుకుంటున్నా. కపిల్ జీ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు" తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. కొందరు ఈ వీడియోను మార్ఫింగ్ చేశారని అంటున్నారు. మరికొందరు మాత్రం ఏదైనా ప్రకటనకు సంబంధించిన షూట్ కావొచ్చంటున్నారు. లేదంటే త్వరలోనే ప్రపంచకప్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన యాడ్ అని చెబుతున్నారు. మరి కపిల్ నోరు విప్పితే కానీ ఈ వీడియోపై క్లారిటీ రాదు. Anyone else received this clip, too? Hope it’s not actually @therealkapildev 🤞and that Kapil Paaji is fine! pic.twitter.com/KsIV33Dbmp — Gautam Gambhir (@GautamGambhir) September 25, 2023 మరోవైపు రెండు రోజుల క్రితం వారణాసిలో జరిగిన క్రికెట్ స్టేడియం శంకుస్థాపన కార్యక్రమానికి కపిల్ దేవ్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి వంటి వారు పాల్గొన్నారు. వీరికి సంబంధించిన ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. 1983లో జరిగిన ప్రపంచకప్ ట్రోపిని భారత్‌కు అందించిన మొట్టమొదటి కెప్టెన్ కపిల్ దేవ్. ఆ టోర్నీలో కపిల్ ఆట ఎంతో మంది అభిమానులను సంపాందించి పెట్టింది. తన ఆటతో పాటు కెప్టెన్సీతో భారత్‌ను విశ్వవిజేతగా నిలబెట్టారు. కపిల్ జీవితం ఆధారంగానే ఇటీవల 83 సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాలో కపిల్ పాత్రను బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ పోషించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. #cricket #gautam-gambhir #kapil-dev మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి