Bapatla: టీడీపీ సర్కార్ వైసీపీకి వరుస షాక్‌లు ఇస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాల్లోని వైసీపీ కార్యాలయాలకు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారని, వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులు పంపిస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ, అనకాపల్లి, రాజమండ్రి, నెల్లూరు, అనంతపురం, కడపలోని వైసీపీ కార్యాలయాలకు అధికారులు నోటీసులు అంటించారు. అయితే, తాజాగా, బాపట్ల జిల్లాలోనూ వైసీపీకి ఇదే పరిస్థితి ఎదురైంది.
Also Read: తెరపైకి APSRTC లీజు వ్యవహారం.. ఆర్టీసీ ఆర్ఎంతో చర్చించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్థనరావు.!
అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించారణి ఆరోపిస్తూ వైసీపీ జిల్లా కార్యాలయానికి పురపాలక అధికారులు నోటీసులు అంటించారు. అక్రమ నిర్మాణంపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణారావుకు నోటీసులు ఇవ్వడానికి అధికారులు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులో లేరని వైసీపీ జిల్లా కార్యాలయానికి నోటీసులు అంటించి వెళ్లా.