TS Politics: అవి పిచ్చొళ్ల మాటలు..మా వల్లే అక్కడ బీఆర్‌ఎస్‌ గెలిచింది..సీపీఐ పొత్తు ఎవరితోనంటే..?

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. ప్రస్తుతానికైతే బీఆర్‌ఎస్‌తోనే ఉన్నామన్నారు. అడగాల్సిన సీట్లు అడుగుతామని స్పష్టం చేశారు.

TS Politics: అవి పిచ్చొళ్ల మాటలు..మా వల్లే అక్కడ బీఆర్‌ఎస్‌ గెలిచింది..సీపీఐ పొత్తు ఎవరితోనంటే..?
New Update

రాష్ట్ర పరిస్థితులు వేరు.. దేశ పరిస్థితులు వేరు.. రాష్ట్ర ప్రయోజనాలు వేరు..దేశ ప్రయోజనాలు వేరు.. ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. కేంద్రంలోని బీజేపీని గద్దె దింపడం కోసం అక్కడ కాంగ్రెస్‌తో కలిసి ఉన్నంత మాత్రానా రాష్ట్రంలోనూ వాళ్లతోనే ఉండాలని లేదని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికైతే రాష్ట్రంలో ఏ పార్టీతో కలిసి వెళ్లలన్నదానిపై ఓ నిర్ణయం అయితే తీసుకోలేదని.. ప్రస్తుతానికైతే పాత పొత్తులో భాగంగా బీఆర్‌ఎస్‌తోనే కలిసి ఉన్నట్టు చెప్పారు. మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీల సపోర్ట్‌తోనే బీఆర్‌ఎస్‌ గెలిచిందన్నారు కూనంనేని. రానున్న ఎన్నికలకు ఇద్దరం(బీఆర్‌ఎస్‌,లెఫ్ట్) అనుకుంటే ఉంటామని.. లేకపోతే లేదని చెప్పారు.

మేం ఎవర్ని అపాయింట్‌మెంట్‌ అడగలేదు:
పిచ్చొళ్ల మాటలు పట్టించుకోమంటూ హాట్‌ కామెంట్స్ చేశారు కూనంనేని. మేం ప్రగతిభవన్‌ పిలువు కోసం ఎప్పుడూ వెయిట్ చేయలేదన్నారు. రోజుకో పార్టీలో ఉండేవాళ్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారని.. నిజమైన కమ్యూనిస్టులు ఎప్పుడూ ఈ తరహా వ్యాఖ్యలు చేయరంటూ విమర్శకులకు చురకలంటించారు. మేం కలుద్దాం అని ఒక్కసారే అడిగామని.. మేం ప్రతిపాదించేది ఏంది..ఆయన(కేసీఆర్‌) పర్మిషన్‌ ఇచ్చుడు ఏంది అంటూ విమర్శలను తిప్పికొట్టారు కూనంనేని. మేం అడిగినన్ని స్థానాలు బీఆర్‌ఎస్‌ ఇవ్వడంలేదన్న ప్రచారంలో నిజంలేదని క్లారిటి ఇచ్చారు. మేం బలంగా ఉన్నాం కాబట్టి అడగాల్సిన సీట్లు అడుగుతామని స్పష్టం చేశారు.

తర్వాత ఆలోచిద్దాం:
పోస్ట్ పోల్ అలైన్‌మెంట్‌ వేరు.. ప్రీపోల్‌ అలైన్‌మెంట్ వేరు అని అభిప్రాయపడ్డారు కూనంనేని. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత దేశాన్ని ఎవరు పాలించాలన్నది ముఖ్యమని..అలాంటి సమయంలో తమ పార్టీకి ఉన్న ఎకైక లక్ష్యం బీజేపీని రానివ్వకుండా చేయడమేనన్నారు. కమ్యూనిస్టులు సింగిల్‌గా వెళ్లడంలేదని కొందరు అడుగుతున్నారని.. మరీ ఇదే ప్రశ్న కాంగ్రెస్‌, బీజేపీలను ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు కూనంనేని. అటు చంద్రబాబు ఎప్పుడైనా ఒంటరిగా వెళ్లారా అని క్వశ్చన్‌ చేశారు. తెలంగాణలో సీపీఐ, సీపీఎం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేస్తామన్నారు. దేశంలో కాంగ్రెస్‌తో కలిసి ఉన్నంత మాత్రానా ఇక్కడ కూడా ఉండాలని రూల్‌ లేదని తెలిపారు.

అక్కడే వాళ్లే ప్రత్యర్ధులు కదా?

కేరళలో కాంగ్రెస్‌కి కమ్యూనిస్టులే ప్రధాన ప్రత్యర్థులని.. అటు బెంగాల్‌లోనూ టీఎంసీకి కమ్యూనిస్టులు ప్రత్యర్థి పార్టీగా ఉన్నారన్న విషయం మరవద్దన్నారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీని కేంద్రంలో అధికారంలోకి రాకుండా చేయడం కోసమే అక్కడ INDIAకూటమి పక్షాన నిలిచామన్నారు కూనంనేని.. మరోవైపు వచ్చే ఎన్నికలకు కమ్యూనిస్టులకు కేసీఆర్‌ ఓ ప్రతిపాదన పంపారని.. రెండు ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎమ్మెల్సీ సీట్లు కేటాయిస్తామని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిపాదనను కూనంనేని, తమ్మినేని నిరాకరించినట్టు టాక్‌ వినిపిస్తోంది. బీఆర్‌ఎస్‌తో పొత్తు కుదరకపోతే వేరే ప్లాన్‌ అమలు చేసేందుకు కమ్యూనిస్టులు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇలా నేతలు చెబుతున్న మాటలు ఒకటి.. జరుగుతున్న పరిణామాలు ఒకటంటూ పార్టీ క్యాడర్‌ సైతం కన్ఫ్యూజన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe