రాష్ట్ర పరిస్థితులు వేరు.. దేశ పరిస్థితులు వేరు.. రాష్ట్ర ప్రయోజనాలు వేరు..దేశ ప్రయోజనాలు వేరు.. ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. కేంద్రంలోని బీజేపీని గద్దె దింపడం కోసం అక్కడ కాంగ్రెస్‌తో కలిసి ఉన్నంత మాత్రానా రాష్ట్రంలోనూ వాళ్లతోనే ఉండాలని లేదని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికైతే రాష్ట్రంలో ఏ పార్టీతో కలిసి వెళ్లలన్నదానిపై ఓ నిర్ణయం అయితే తీసుకోలేదని.. ప్రస్తుతానికైతే పాత పొత్తులో భాగంగా బీఆర్‌ఎస్‌తోనే కలిసి ఉన్నట్టు చెప్పారు. మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీల సపోర్ట్‌తోనే బీఆర్‌ఎస్ గెలిచిందన్నారు కూనంనేని. రానున్న ఎన్నికలకు ఇద్దరం(బీఆర్‌ఎస్,లెఫ్ట్) అనుకుంటే ఉంటామని.. లేకపోతే లేదని చెప్పారు.
పూర్తిగా చదవండి..TS Politics: అవి పిచ్చొళ్ల మాటలు..మా వల్లే అక్కడ బీఆర్‌ఎస్ గెలిచింది..సీపీఐ పొత్తు ఎవరితోనంటే..?
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. ప్రస్తుతానికైతే బీఆర్‌ఎస్‌తోనే ఉన్నామన్నారు. అడగాల్సిన సీట్లు అడుగుతామని స్పష్టం చేశారు.

Translate this News: