America: భారత్ వదిలి అమెరికా వెళ్లినా దక్కని స్థానం!

2012 అండర్ 19 ప్రపంచ కప్ ను భారత్ కు అందించిన ఉన్ముక్త్ చంద్ అమెరికా జట్టులో స్థానం కోల్పోయాడు.తాజా గా అతడు రాబోయే టీ20 వరల్డ్ కప్ లో అమెరికా తరుపున జట్టులో ఉంటాడని క్రికెట్ అభిమానులు భావించారు. కాని అమెరికా క్రికెట్ బోర్డు అతనికి షాక్ ఇచ్చింది.

New Update
America: భారత్ వదిలి అమెరికా వెళ్లినా దక్కని స్థానం!

భారత్ వదిలి అమెరికా చేరిన క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ టీ20 ప్రపంచకప్ ఆడాలన్న కల చెదిరినట్లే. ఈ ప్రపంచకప్‌కు ముందు కెనడాతో అమెరికా టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకోసం అమెరికా క్రికెట్ బోర్డు తన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఉన్ముక్త్ చంద్‌కు చోటు దక్కలేదు. ఈ ఏడాది జూన్‌లో టీ20 ప్రపంచకప్‌ జరగాల్సి ఉంది.

ఉన్ముక్త్ చంద్ 2012లో అండర్-19 ప్రపంచకప్‌ కు  భారత్‌ కు కెప్టెన్సీ బాధ్యతులు చేపట్టాడు. అంతేకాకుండా భారత్ కు అండర్ 19 వరల్డ్ కప్పును కూడా అందించాడు. ఆ తర్వాత స్టార్ క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా మంది క్రికెట్ అభిమానులు విశ్లేషకులు అతను భవిష్యత్‌ లో చాలా పెద్ద క్రికెటర్ అవుతాడని అనుకున్నారు. కాని ఉన్ముక్త్ కి కాలం అసలు కలసి రాలేదు. ఐపీఎల్ ముంబయి తరుపున ఆడాడు. ఫాం లో లేక సతమతమైయాడు. భారత్ క్రికెట్ లో  కురాళ్ల జోరు పెరగటంతో అతడు భారత క్రికెట్ జట్టులో  ఐపీఎల్ జట్టులో చోటు దక్కించుకోలేక స్థానం కోల్పోయాడు. దీని తర్వాత ఉన్ముక్త్ చంద్ అమెరికా వెళ్లారు. అతను అమెరికన్ లీగ్ క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేశాడు. దీంతో అతడికి అమెరికా జట్టులో చోటు దక్కుతుందని అంతా భావించారు. అయితే కెనడాతో జరిగే టీ20 సిరీస్‌లో ఉన్ముక్త్‌ను అమెరికన్ బోర్డు జట్టులో చేర్చుకోలేదు.

అమెరికా జట్టు: మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్ (వైస్ కెప్టెన్), ఆండ్రీస్ గౌస్, కోరీ అండర్సన్, గజానంద్ సింగ్, హర్మీత్ సింగ్, జెసి సింగ్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, నితీష్ కుమార్, నోష్టుష్ కెంజిగే, సౌరభ్ నేత్రవాల్కర్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్ ., స్టీవెన్ టేలర్, ఉస్మాన్ రఫిక్.

Advertisment
తాజా కథనాలు