YCP: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో అధికార పార్టీ వైసీపీ నేతలు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైదాపురంలో డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఉన్న "స్వస్తిక్ వెహికల్ వాటర్ సర్వీస్ సెంటర్"ను ఆదివారం అర్ధరాత్రి కూల్చి వేశారని వాటర్ సర్వీస్ సెంటర్ యజమాని కాంతు వాపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: చంద్రబాబుకు బెయిల్ మంజూరుపై లోకేష్ ఎమన్నారంటే..?
"స్వస్తిక్ వెహికల్ వాటర్ సర్వీస్ సెంటర్" ధ్వంసం చేయడంపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వం అండతో వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం తగదని హెచ్చరించారు. ఈ ఘటనలో దాదాపు 30 లక్షలు విలువచేసే మిషనరీ పాడైందని ఆయన తెలిపారు. ఈ వాటర్ సర్వీస్ సెంటర్ పై ఆధారపడి పది కుటుంబాలు బతుకుతున్నాయని వాపోయారు.
Also read: విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనపై మంత్రి అప్పలరాజు రియాక్షన్ ఇదే.!
అయితే, గతంలో ఈ స్థలం పై వివాదం తలెత్తిందని.. ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తోందని తెలిపారు. అయితే, ఈ విషయంలో రెవెన్యూ అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపించారు స్వస్తిక్ వెహికల్ వాటర్ సర్వీస్ సెంటర్ యజమాని. సైదాపురంలో ఎవరిని అడిగినా ఈ స్థలం కృష్ణమూర్తి కుటుంబానికి చెందినదని చెబుతారని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడిన రౌడీ మూకలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమకు ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.