TS CMO: సీఎంవోలో దొంగ ఆఫీసర్!.. ప్రొటోకాల్ ఆఫీసర్నంటూ సెటిల్మెంట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో హల్ చల్ చేస్తున్న ఓ నకిలీ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎంవోలో ప్రొటోకాల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నట్లు చెప్పుకుంటూ వనస్థలిపురానికి చెందిన అత్తిలి ప్రవీణ్ సాయి అనే యువకుడు వసూళ్లకు తెరతీశాడు. ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. By Naren Kumar 09 Dec 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి TS CMO: తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో హల్ చల్ చేస్తున్న ఓ నకిలీ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎంవోలో ప్రొటోకాల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నట్లు చెప్పుకుంటూ వనస్థలిపురానికి చెందిన అత్తిలి ప్రవీణ్ సాయి అనే యువకుడు వసూళ్లకు తెరతీశాడు. పలువురు ఫిర్యాదులు చేయడంతో ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ఇది కూడా చదవండి: వీళ్ల తెలివి పాడుగాను.. ఏకంగా ఫేక్ ‘టోల్ ప్లాజా’ ఏర్పాటు చేసి కోట్లు దండుకున్నారు సీఎంవోలో ప్రొటోకాల్ ఆఫీసర్నని చెప్పుకుంటూ అవకతవకలకు పాల్పడున్న ప్రవీణ్ సాయి అనే యువకుడిని పోలీసులు గుర్తించారు. సీఎంవో పేరు చెప్పి పలు అతడు అక్రమాలకు పాల్పడ్డాడు. సెటిల్మెంట్ల పేరుతో దందాకు తెర తీసి భారీగా వసూళ్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. ల్యాండ్ సెటిల్మెంట్లతో పాటు, అసైన్డ్ ల్యాండ్ రీ అసైన్ చేస్తానని కూడా పెద్ద మొత్తంలో వసూళ్లు చేసినట్లు బాధితులు అందించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కొందరు వ్యక్తులకు సీఎం ప్రొటోకాల్ నకిలీ స్టిక్కర్లను కూడా ప్రవీణ్ సాయి ఇప్పించాడు. హోం మంత్రి, మంత్రుల లెటర్ హెడ్లతో ఉద్యోగాలు ఇప్పిస్తానని కూడా పలువురు యువకుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఆరు నెలల క్రితం ఈ విధంగా పైరవీలు చేస్తూ కొందరు వ్యక్తులకు శఠగోపం పెట్టాడు. ఎట్టకేలకు ప్రవీణ్ సాయిని అరెస్ట్ చేసిన ఎల్బీ నగర్ ఎస్వోటీ పోలీసుల అతడి నుంచి ఇన్నోవా కారు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. #crime-news #fake-officer-in-ts-cmo మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి