LB Nagar Sanghavi: పాపం సంఘవి జీవితాంతం ఇంతేనా.. హెల్త్ బులిటెన్‌లో షాకింగ్ విషయాలు ఎల్బీనగర్ ప్రేమోన్మాది దాడి ఘటనలో బాధితురాలు సంఘవి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. సంఘవి ఆరోగ్య పరిస్థితిపై AIG హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సంఘవికి తీవ్రంగా కత్తి పోట్లు, ముఖంపై గాట్లు గాయ్యాయని తెలిపారు. By BalaMurali Krishna 04 Sep 2023 in క్రైం హైదరాబాద్ New Update షేర్ చేయండి ఎల్బీనగర్ ప్రేమోన్మాది దాడి ఘటనలో బాధితురాలు సంఘవి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. సంఘవి ఆరోగ్య పరిస్థితిపై AIG హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సంఘవికి తీవ్రంగా కత్తి పోట్లు, ముఖంపై గాట్లు గాయ్యాయని తెలిపారు. ముఖంపై గాట్లుకు ప్లాస్టిక్ సర్జన్ కుట్లు వేశారని వెల్లడించారు. గర్భాశయం సమీపంలో వెన్నెముకకు తీవ్రమైన గాయమైందని.. ఈ గాయం కీలకమైన నరాలపై ఎఫెక్ట్ చూపే ఛాన్స్ ఉందన్నారు. దీంతో ఆమె జీవితాంతం అచేతనంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సర్జరీలు చేస్తామని.. సంఘవి ప్రాణాలు కాపాడడమే కాదు..వైద్య ఖర్చులు పూర్తిగా భరిస్తామని కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. ఆమె కోలుకునేందుకు మరికొన్ని రోజులు పడుతుందని ప్రకటించారు. అసలేం జరిగిదంటే..? ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడిన నిందితుడు శివకుమార్ అక్కా, తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఆమె తమ్ముడిని పొడిచాడు. అతను అరుస్తూ బయటకు పరుగులు తీశాడు. గమనించిన స్థానికులు వచ్చి నిందితుడిని ఓ గదిలో బంధించి పోలీసులకు అప్పగించారు. యువతి తమ్ముడు ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు. తీవ్ర గాయాలతో ఉన్న యువతిని ఉస్మానియాకు తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఏఐజీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. మరోవైపు ఉన్మాది శివకుమార్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. దుర్మార్గుడిని ఉరితీయాలని స్థానికులు, సంఘవి కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. RTVతో సంఘవి, పృధ్వీ సోదరుడు శ్రీనివాస్ ఏం చెప్పాడంటే.. ➞ పృధ్వీ ఛాతిపై శివకుమార్ బలంగా కత్తితో దాడి చేశాడు ➞ 10వ తరగతి నుంచి శివకుమార్ మా చెల్లిని వేధిస్తున్నాడు ➞ సంఘవి ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూశాడు ➞ చంపాలన్న ప్లాన్‌తోనే ఇంటికి కూడా వచ్చాడు ➞ మా తమ్ముడు మొబైల్ చూస్తూ ఉండగా ఒక్కసారిగా కత్తితో ఛాతిలో పొడిచాడు ➞ గదిలో ఉన్న మా చెల్లి సంఘవిని పెళ్లి చేసుకుంటావా లేదా చంపేస్తానంటూ బెదిరించాడు ➞ గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి సంఘవిని బయటకు తీసుకొచ్చారు ➞ 20 నిమిషాల పాటు కాపాడండి అంటూ పరిగెత్తాడు మా తమ్ముడు ➞ స్థానికులు వీడియోలు తీశారు కానీ పట్టిచుకోలేదు.. ➞ మానవత్వం లేకుండా చూశారు.. కనీసం దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లలేదు ➞ చంపొద్దని శివకుమార్ కాళ్లపై పడి ప్రాధాయపడినా వదల్లేదు ➞ శివకుమార్‌కి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది... సొంత తండ్రినే శివ హత్య చేశాడు ➞ ఇలాంటి ఉన్మాదిని ఉరి తీయాలని కుటుంబసభ్యుల తరపున డిమాండ్ చేస్తున్నాం ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. ‘బంగారం’ అంటూనే.. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి