MLA Sudheer Reddy on Chandrababu Arrest: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత చంద్రబాబు నాయుడిని(Chandrababu Naidu) అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఆయన అభిమానులు హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే, ఈ ర్యాలీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి(MLA Sudheer Reddy) కూడా పాల్గొన్నారు. నిరసనకారులకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే.. ఆ ర్యాలీలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు.. బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి కూడా ఇందులో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురంలోని NTR చౌరస్తా వద్ద చంద్రబాబు మద్దత్తుదారులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. 'సైకో జగన్ పోవాలి సైకిల్ బాబు రావాలి' అంటూ అంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనలో వనస్థలిపురం పరిసరప్రాంత కాలనీవాసులు, ఐటి ఉద్యోగులు, చంద్రబాబు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీలకు అతీతంగా కుటుంబ సభ్యులతో ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. అయితే, పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు.
కాగా, వీరి నిరసనకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు మద్దతు తెలిపి ర్యాలీలో పాల్గొన్నారు. పనామా చౌరస్తాలో ఎన్టీర్ విగ్రహానికి పూల మాల వేశారు. చంద్రబాబుకు మద్ధతుగా నినదించారు. అయితే, ఈ నిరసన వ్యక్తం చేసే క్రమంలో భారీగా ఆందోళనకారులు రోడ్డుపైకి రావడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కాగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య సల్ప వాగ్వాదం, తోపులాట చోటుచేసుకోగా కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి, విడుదల చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని చంద్రబాబు మద్దత్తుదారులు, అభిమానులు జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Also Read:
Congress: తెలంగాణపై కాంగ్రెస్ హామీల వర్షం.. సోనియా ప్రకటించిన 6 గ్యారంటీలు ఇవే..
Maruti Fronx: జస్ట్ రూ. 50 వేలు ఉంటే కొత్త కారు మీ సొంతం.. పూర్తి వివరాలు ఇవే..