Kanguva : 1000 మంది డ్యాన్సర్స్ తో 'కంగువ' సాంగ్.. ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ గ్యారెంటీ!

'కంగువ' ఫస్ట్ సింగిల్‌ పై అదిరిపోయే అప్డేట్ బయటికొచ్చింది. తాజాగా నిర్వహించిన చిట్ చాట్ లో కొరియోగ్రాఫర్ సాంగ్ గురించి మాట్లాడారు. ఈ పాట 1000 మంది ఆర్టిస్టులతో భారీ స్థాయిలో ఉండబోతుందట. దేవిశ్రీప్రసాద్ ఈ సాంగ్ కు తన కంపొజిషన్ తో గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని అన్నారు.

Kanguva : 1000 మంది డ్యాన్సర్స్ తో 'కంగువ' సాంగ్.. ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ గ్యారెంటీ!
New Update

Latest Update On Kanguva First Single : తమిళ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటిస్తున్న లేటేస్ట్ ఫిల్మ్ 'కంగువ'. భారీ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా సూర్య కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన సూర్య లుక్, టీజర్ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచేశాయి. సూర్య ఐదు విభిన్న తరహా పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అక్టోబర్ 10 దసరా కానుకగా పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ బయటికొచ్చింది. కంగువ ఫస్ట్ సింగిల్‌ను సూర్య బర్త్‌ డే సందర్భంగా లాంచ్‌ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో కంగువ కొరియోగ్రాఫర్ తాజాగా నిర్వహించిన చిట్ చాట్ సెషన్ లో తెలిపారు. దాని ప్రకారం.. ఈ పాట 1000 మంది ఆర్టిస్టులతో భారీ స్థాయిలో ఉండబోతుందట.

Also Read : ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, కానీ వరలక్ష్మి ఫస్ట్ లవ్ నేను కాదు.. నికోలై సచ్‌దేవ్‌ షాకింగ్ కామెంట్స్!

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సాంగ్ కు తన కంపొజిషన్ తో గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని, సాంగ్ లో సూర్య లుక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని పేర్కొన్నారు, దీంతో ఒక్కసారిగా కంగువ ఫస్ట్ సింగల్ పై అంచనాలు పెరిగిపోయాయి. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది.

#suriya-kanguva-movie #kanguva-first-single
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe