🔴 LIVE NEWS: HMPV వైరస్ పై WHO మాజీ సైంటిస్ట్ షాకింగ్ న్యూస్ By Manoj Varma 08 Jan 2025 | నవీకరించబడింది పై 08 Jan 2025 10:20 IST in Latest News In Telugu New Update breaking news షేర్ చేయండి Jan 08, 2025 10:20 IST HMPV వైరస్ పై WHO మాజీ సైంటిస్ట్ షాకింగ్ న్యూస్ HMPV కేసులు ఇంతకుముందు నుంచే వ్యాప్తి చెందుతున్నాయని WHO మాజీ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. ఇండియాలో టెస్టులు చేసిన వారిలో 3శాతం పాజిటివ్ వస్తుందని ఆమె అన్నారు. చలితీవ్రత పెరుగుతున్న కారణంగా వైరస్ వ్యాప్తి కూడా వేగంగా విస్తరిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. WHO HMPV Photograph: (WHO HMPV) Jan 08, 2025 08:14 IST అస్సాం బొగ్గు గని ప్రమాదం.. ముగ్గురు మృతి అస్సాం ర్యాట్ హోల్‌లో బొగ్గు గనిలో చిక్కుకున్న కార్మికుల్లో ముగ్గురు మృతి చెందారు. గనిలో చిక్కుకున్న వారిలో ముగ్గురు కార్మికులు మరణించారు. అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. Jan 08, 2025 08:13 IST ప్లీజ్.. ఆ వీడియోను తొలిగించండి : కోర్టు మెట్లెక్కిన రమ్య హాస్టల్ హుడుగారు బేకగిద్దరే చిత్రంలో తన అనుమతి లేకుండా తన వీడియోను వాడుకున్నారని వాటిని తొలిగించాలంటూ నటి, మాండ్య మాజీ ఎంపీ రమ్య అలియాస్ దివ్యస్పందన కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆమె కోటి రూపాయలను పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేసింది. ramya ex mp Photograph: (ramya ex mp) Also Read : https://rtvlive.com/cinema/actress-ramya-appears-in-court-over-hostel-hudugaru-bekagiddare-dispute-8600345 Jan 08, 2025 08:12 IST ఆంధ్రాకు నేడు ప్రధాని మోదీ.. కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ఏపీ అభివృద్ధి చెందేలా రూ.28 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నడుం బిగించాయి. ఈరోజు ప్రధాని మోదీ చేతుల మీదుగా వీటిని ప్రారభించనున్నారు. Jan 08, 2025 08:11 IST సిగరెట్ తీసుకురాలేదని.. 8 ఏళ్ల బాలుడిని దారుణంగా.. సిగరెట్ తీసుకురాలేదని ఎనిమిదేళ్ల బాలుడిని కాల్చి చంపిన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. చలి కోసం మంటల దగ్గర ఆ బాలుడు ఉన్నాడు. ఇంతలో ఓ రౌడీ షీటర్ సిగరెట్ తెమ్మని డిమాండ్ చేశాడు. బాలుడు నిరాకరించడంతో తన పిస్టోల్‌తో కాల్చి చంపాడు. Pistol Photograph: (Pistol) Jan 08, 2025 08:11 IST బంగ్లా మాజీ ప్రధాని షేక్ హాసినా పాస్‌పోర్టు రద్దు! Jan 08, 2025 08:10 IST HMPV వైరస్ ఎఫెక్ట్.. ఆ రాష్ట్రంలో ఐసోలేషన్ సెంటర్లు ఓపెన్ గుజరాత్ లో సోమవారం hmpv కేసు నమోదు కాగా.. ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గాంధీనగర్, అహ్మదాబాద్, రాజ్‌కోట్ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 45 బెడ్లు ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య శాఖ ప్రకటనలో తెలిపింది. isolation center Photograph: (isolation center) మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి