🔴Iran-Israel War LIVE Updates: ఖమేనీ మృతి ఇరాన్‌ సంచలన ప్రకటన.. లైవ్‌ అప్‌డేట్స్‌

ట్రంప్ చేసిన ప్రకటన ప్రకారం, అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో అలీ ఖమేనీ మరణించారని తెలిపారు. ఇరాన్ మీడియా ఖమేనీతో పాటు కుటుంబ సభ్యులు నలుగురు చనిపోయినట్లు వెల్లడించింది. తాజాగా ఈ ఘటనపై ఇరాన్ ప్రభుత్వం అధికారిక ధృవీకరణ ఇచ్చింది.

By Lok Prakash & Manoj Varma
New Update
Iran- Israel War LIVE Updates

Iran-Israel War LIVE Updates

Iran-Israel War LIVE Updates: ఇరాన్‌పై జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. దేశంలో 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, దాడి జరిగిన కొన్ని గంటలకే ఖమేనీ మరణించారని తెలిపారు. ఆయన వ్యాఖ్యలతో ఈ విషయం మరింత చర్చకు దారి తీసింది. ఖమేనీ పాలనపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సంఘటన ఇరాన్ ప్రజలకు ఒక పెద్ద మార్పు తీసుకురావొచ్చని ఆయన అన్నారు.

అయతుల్లా అలీ ఖమేనీ 1939 ఏప్రిల్ 19న ఇరాన్‌లోని మష్హాద్ నగరంలో జన్మించారు. 1981లో మొహమ్మద్ అలీ రాజాయ్ మరణం తర్వాత ఆయన ఇరాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తరువాత 1989లో దేశ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించి, ఎన్నో సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగారు.

ఈ సంఘటనపై ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను దగ్గరగా గమనిస్తున్నాయి.

  • Mar 02, 2026 14:50 IST

    జెరూసలేంపైనా ఇరాన్‌ తాజా దాడులు

    దుబాయి, అబుదాబీ సిటీలపైనా ఆగని ఇరాన్‌ దాడులు.. దుబాయి - ఇరాన్‌ మధ్య ఉన్న హార్మోజ్‌ జలసంధి ద్వారా క్రూడాయిల్‌ రవాణా నౌకలు వెళ్లకుండా ఆపేసిన ఇరాన్‌



  • Mar 02, 2026 13:20 IST

    అమెరికా ఫైటర్ జెట్ ను కూల్చేసిన ఇరాన్.. షాకింగ్ వీడియో!

    మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. తాజాగా కువైట్‌లో అమెరికాకు చెందిన F15 స్ట్రైక్‌ ఈగల్ ఫైటర్‌ జెట్‌ కుప్పకూలినట్లు తెలుస్తోంది.

    Iran Shoots Down Trump Fighter Jet🔴LIVE : ట్రంప్ యుద్ధ విమానాన్నిపేల్చేసిన ఇరాన్ | US Israel War|RTV

    Know More: https://rtvlive.com/international/iran-shoots-down-american-fighter-jet-11168497



  • Mar 02, 2026 13:02 IST

    పక్కా ప్లాన్‌తో ఖమేనీకి స్పాట్.. అమెరికా ఎలాంటి టెక్నాలజీ వాడిందో తెలుసా?

    ఇజ్రాయెల్, అమెరికా చేపట్టిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందడం ప్రపంచ దేశాలను షాక్‌కు గురిచేసింది. అయితే ఈ దాడి ఒక్కరోజులో చేసింది కాదు. అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థలు కొన్ని నెలల ముందే ప్లాన్ చేశాయి.

    CIA tracked Khamenei for months, killed him in two hours and five minutes
    CIA tracked Khamenei for months, killed him in two hours and five minutes



  • Mar 02, 2026 12:29 IST

    ఇరాన్ కు మద్దతుగా శ్రీనగర్ లో షియా ముస్లిం ల ఆందోళనలు

    రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు. ఆందోళన కారులను అడ్డుకున్న కేంద్ర బలగాలు. టియర్ గ్యాస్ ప్రయోగించి, ఆందోళన కారులను విచ్చినం చేసిన పోలీసులు



  • Mar 01, 2026 20:43 IST

    ఖమేనీ మరణం.. కర్ణాటకలోని ఆ గ్రామంలో సంతాప దినాలు

    అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో కర్ణాటకలోని ఓ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ గ్రామంలో మూడు రోజులు పాటు సంతాప దినాలు ప్రకటించారు.

    Ali Khamenei
    Ali Khamenei



  • Mar 01, 2026 20:11 IST

    అమెరికా ప్లాన్‌ మాములుగా లేదుగా.. ఖమేనీని ఎలా హతమార్చిందో తెలుసా ?

    ఇరాన్ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మరణం ప్రపంచ దేశాలను షాక్‌కు గురి చేసింది. అమెరికా భారీ ప్లాన్ ప్రకారం అతడిని హత్య చేసింది. ఖమేనీయే టార్గెట్‌గా ఆపరేషన్ ఎపిక్‌ ఫ్యూరీని చేపట్టింది.

    How Israel-US Strikes targeted khamenei and his inner circle
    How Israel-US Strikes targeted khamenei and his inner circle



  • Mar 01, 2026 18:59 IST

    ఇరాన్‌ల తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు

    ఇరాన్‌ తాత్కాలిక నాయకత్వ మండలి ఏర్పాటు. మండలిలో ఇరాన్‌ ప్రెసిడెంట్‌, జ్యుడీషియరీ చీఫ్‌.



  • Mar 01, 2026 16:43 IST

    ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం

    అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై జరిపిన దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలిరెజా అరాఫీ నియమితులయ్యారు.

    Alireza Arafi Appointed as Iran Interim Supreme Leader
    Alireza Arafi Appointed as Iran Interim Supreme Leader



  • Mar 01, 2026 16:43 IST

    ఇరాన్-అమెరికా యుద్ధం.. భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం

    ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేయడం ప్రపంచ ఇంధన్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపననున్నాయి. ఈ క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ఎఫెక్ట్ పడనున్నట్లు తెలుస్తోంది.

    Crude oil prices spike amid US-Iran war
    Crude oil prices spike amid US-Iran war



  • Mar 01, 2026 16:42 IST

    రణరంగమైన కరాచీ...ఘర్షణల్లో 9 మంది మృతి

    ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో ఆందోళనకారుల నిరసన రణరంగంగా మారింది. తమ మత గురువుగా భావించే సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో ఆందోళన కారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

    FotoJet (3)



  • Mar 01, 2026 16:42 IST

    ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. వెల్లువెత్తిన నిరసనలు

    అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ  మృతి చెందిన విషయాన్ని ఆ దేశం ధృవీకరించడంతో ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ కుటుంబానికి చెందిన పలువురు చనిపోయినట్టు ఇరాన్ మీడియా పేర్కొంది.

    Ali Khamenei



  • Mar 01, 2026 16:41 IST

    ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. తదుపరి సుప్రీంలీడర్‌ ఎన్నికకు ఏర్పాట్లు

    ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ.. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేసిన దాడుల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎవరనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఇరాన్ పాలన త్రిసభ్య కౌన్సిల్ చేతికి వెళ్లింది.



  • Mar 01, 2026 13:33 IST

    Iran-Israel War LIVE Updates:

    అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్‌పై ఉద్రిక్తతలు పెరిగినందున, కరాచీలోని అమెరికా రాయబారి కార్యాలయంపై నిరసనకారులు దాడి చేయడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

    Al Jazeeraకు చెందిన సనద్ ఫ్యాక్ట్-చెకింగ్ విభాగం ధృవీకరించిన వీడియోల్లో, ఆందోళనకారులు కార్యాలయ భవనానికి నిప్పంటించి కిటికీలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు కనిపించాయి.

    ఇరాన్ సుప్రీం లీడర్ Ayatollah Ali Khamenei హత్యకు గురయ్యారన్న వార్తలపై ఆగ్రహంతో ఈ నిరసనలు చెలరేగినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి.



  • Mar 01, 2026 12:45 IST

    Iran-Israel War LIVE Updates:

    ఆదివారం రోజున టెహ్రాన్ నగరంలో పలుచోట్ల భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

    ఇది ఇజ్రాయెల్ మరో సారి దాడులు చేపట్టినట్లు ప్రకటించిన తర్వాత చోటుచేసుకుంది.

    ఆదివారం ఉదయం ఇరాన్‌కు చెందిన బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలు, వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.



  • Mar 01, 2026 12:42 IST

    Iran-Israel War LIVE Updates:



  • Mar 01, 2026 10:16 IST

    Iran-Israel War LIVE Updates:

    ఆదివారం ఇరాన్ నుంచి క్షిపణులు ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ నేపథ్యంలో మధ్య ఇజ్రాయెల్ ప్రాంతాలతో పాటు ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని కొన్ని ప్రాంతాల్లో హెచ్చరిక సైరన్లు మోగాయి.

    “ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ వైపు క్షిపణులు వస్తున్నట్లు గుర్తించిన తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో సైరన్లు వినిపించాయి. అవసరమైన చోట్ల ముప్పును అడ్డుకునేందుకు, తగిన చర్యలు తీసుకునేందుకు వాయుసేన పని చేస్తోంది” అని సైన్యం పేర్కొంది.



  • Mar 01, 2026 08:07 IST

    Iran-Israel War LIVE Updates:



  • Mar 01, 2026 08:06 IST

    Iran-Israel War LIVE Updates:

    శనివారం ఇరాన్ పై అమెరికా భారీ సైనిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులు, స్టెల్త్ ఫైటర్ జెట్లు వినియోగించాయి. అలాగే యుద్ధంలో మొదటిసారి తక్కువ ఖర్చుతో తయారైన డ్రోన్లను కూడా ఉపయోగించింది. ఇవి ఇరాన్ నమూనాలను ఆధారంగా చేసుకుని రూపొందించినవిగా సమాచారం.

    “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ” పేరుతో జరిగిన ఈ దాడుల వివరాలను యూఎస్ సెంట్రల్ కమాండ్ విడుదల చేసింది. టోమాహాక్ క్షిపణులు, ఎఫ్-18, ఎఫ్-35 యుద్ధ విమానాల చిత్రాలను కూడా విడుదల చేసింది.



  • Mar 01, 2026 07:31 IST

    Ali Khamenei : 35 ఏళ్ల పాలన..ఇరాన్‌ను శాసించిన అలీ ఖమేనీ ప్రస్థానం ఇదే!

    ఇజ్రాయెల్‌-అమెరికా కలిసి సంయుక్తంగా చేసిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. ఈ విషయాన్ని ఇరాన్ కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది.

    Ali Khamenei



Advertisment
తాజా కథనాలు