Viral Video: కూప్పకూలిన అతిపెద్ద ఫ్లై ఓవర్‌.. షాకింగ్ విజువల్స్‌..!

నిత్యం ప్రజల రాకపోకలతో బిజీగా ఉండే లేన్ అది. నిర్మాణంలో ఉన్న వంతెన సడన్‌గా కూలిపోవడంతో పెద్ద శబ్దం వచ్చింది. మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు.

New Update
Viral Video: కూప్పకూలిన అతిపెద్ద ఫ్లై ఓవర్‌.. షాకింగ్ విజువల్స్‌..!

అందరూ అదే ప్లై ఓవర్‌ని చూస్తున్నారు..అది ఆ ప్రాంతంలో అదిపెద్ద ఫ్లై ఓవర్‌ చాలా దూరం నుంచి ఫ్లైవర్‌ని గమనిస్తున్నారు. కొంతమంది కెమెరాను బయటకు తీశారు. మరి కొంతమంది ఫోన్‌లోనే వీడియో రికార్డర్‌ ఆన్ చేశారు. అదే ప్రాంతంవైపు కొత్తగా వస్తున్న వాళ్లకి ఏమీ అర్థంకాలేదు. అందదూ వీడియో రికార్డ్ చేస్తుంటే ఏదైనా సినిమా షూటింగ్ జరుగుతుందా అని ఆగి చూస్తున్నారు. కానీ అక్కడా ఎవరూ కనిపించడంలేదు. ఆత్రుతతో అసలేం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకున్నారు.. మీరంతా ఎందుకు ఆ ఫ్లై ఓవర్‌వైపు చూస్తున్నారు? అసలేం జరుగుతుంది అని అక్కడున్న వారిని ఆరా తీశారు. తర్వాత అసలు విషయం తెలిసింది. ఆ ఫ్లై ఓవర్‌ కూలిపోవడానికి రెడీగా ఉందని.


వీడియో వైరల్:
మహారాష్ట్ర(Maharastra) కొంకణ్(Konkan) ప్రాంతంలో ఓ ఫ్లై ఓవర్‌ నిర్మాణంలో ఉంది. నాలుగు లేన్ల ముంబై-గోవా హైవే నిర్మాణంలో భాగంగా చిప్లూన్‌లో ఓ వంతెనను నిర్మిస్తున్నారు. నిత్యం ప్రజల రాకపోకలతో బిజీగా ఉండే లేన్ అది. బహదూర్ షేక్ వంతెనపై ఫ్లైఓవర్‌ వద్ద మొత్తం 46 పిల్లర్లు ఉన్నాయి. అందులో ఆరో పిల్లర్ వరకు పనులు పూర్తయ్యాయి. మిగిలిన పిల్లర్లకు పనులు జరుగుతున్నాయి. అంతా సాజావుగా సాగుతుందని అంతా భావించారు. అయితే అలా జరగలేదు.


నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి గిర్డర్‌ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో ఫ్లైఓవర్‌ కుప్పకూలింది. నిర్మాణంలో ఉన్న వంతెన సడన్‌గా కూలిపోవడంతో పెద్ద శబ్దం వచ్చింది. వెంటనే గుండె దడేల్‌ మన్నది. పెద్ద సౌండ్‌ రావడంతో అక్కడి స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వంతెనపై ఉన్న క్రేన్ కూడా పూర్తిగా దెబ్బతిన్నది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

ALSO READ: అదోక పీడ కల.. తలచుకుంటేనే ఏడుపు వస్తుంది.. ఈసారి కూడా అదే జరుగుతుందా?

Advertisment
తాజా కథనాలు