Kadapa: కడప జిల్లాలో మేఘా సంస్థ మట్టి దోపిడీపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ టు బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పనులు దక్కించుకున్న మేఘా సంస్థ.. రోడ్డు నిర్మాణం కోసం మల్లెపల్లె, తోట్లపల్లి చెరువుల్లో మట్టి తోడేస్తోందని ఆరోపించారు. అనుమతి ఒక చోట తీసుకుని.. మరో చోట మట్టి తవ్వకాలు చేస్తుందని భారీగా తవ్వకాలు చేపట్టిందని రైతులు వాపోతున్నారు.
Also Read: పాలన చేతకాని వాడికి ప్రతిపక్ష హోదా ఎందుకు? జగన్‌పై ఎమ్మెల్యే ఫైర్..!
నిబంధనలకు విరుద్దంగా మేఘా సంస్థ మట్టి దోపిడీ చేస్తుందని చెరువు సమీపంలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ లేని సమయంలో మట్టిని తరలిస్తున్నారని, రాత్రి సమయాల్లో పెద్ద పెద్ద వాహనాలు, క్రేన్లతో సహాయంతో మట్టిని తరలిస్తున్నారన్నారు. కొందరు స్థానిక నేతల సహకారంతోనే ఈ మట్టి దోపిడీ చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.