Lakshmi Parvati : చంద్రబాబు అరెస్ట్ వెనుక అసలు విషయం అదే.. బయటపెట్టిన లక్ష్మిపార్వతి

చంద్రబాబు అరెస్ట్‌తో ప్రజలంతా సంతోష పడుతున్నారని..తెలుగు, సంస్కృతి అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి తెలిపారు. ఇన్నాళ్లు చంద్రబాబు వ్యవస్థల్ని మ్యానేజ్ చేస్తూ వచ్చాడని ఆమె ఆరోపించారు. పెద్దాయన NTR ఉసురు తగిలిందని అందుకే చంద్రబాబు పాపం పండిందని..లక్ష్మీపార్వతి హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ ఘాట్ దగ్గర నివాళులర్పించారు.

New Update
Lakshmi Parvati : చంద్రబాబు అరెస్ట్ వెనుక అసలు విషయం అదే.. బయటపెట్టిన లక్ష్మిపార్వతి

Lakshmi Parvati on Chandrababu arrest: ఎన్టీఆర్‌ ఘాట్ దగ్గర నివాళులర్పించారు తెలుగు, సంస్కృతి అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మిపార్వతి. ఆనంతరం చంద్రబాబు అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవినీతిప­రుడని కోర్టు ద్వారా ప్రజలందరికీ తెలిసిందని హర్షం వ్యక్తం చేశారు. 74వ ఏట ఎన్టీఆర్‌కు ఘోరమైన అవమానం చేసిన చంద్రబాబు.. విచిత్రంగా అదే 74వ ఏటా తాను కూడా క్షోభ అనుభవించాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. ఇన్నాళ్లు వ్యవస్థల్ని మ్యానేజ్ చేస్తూ వచ్చాడని..అయితే తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదని అన్నారు.

ఇటీవల కాలంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా స్మారక నాణెం విడుదల చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించిన కేంద్రం.. లక్ష్మీపార్వతిని మాత్రం ఆహ్వానించలేదు. దీనిపై ఆమె నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ భార్యనని తాను బోర్డు కట్టుకు తిరగాలా అని ప్రశ్నించారు. ఇందుకు కారణమైన పురందేశ్వరిపైనా రెచ్చిపోయారు.ఎన్టీఆర్ నాణెం విడుదల ప్రభుత్వ కార్యక్రమం అయితే ప్రోటోకాల్ ప్రకారం తనను పిలవాలని లక్ష్మీపార్వతి తెలిపారు. ఎన్టీఆర్ భార్యగా తనకు ఆహ్వానం అందాలన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు కార్యక్రమానికి హాజరు అవుతున్నారని, తనకు మాత్రం ఆహ్వానం లేదన్నారు. ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమానికి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు వెళ్లడం అభ్యతరకరమని లక్ష్మీపార్వతి ఆక్షేపించారు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారంపై ఏపీ రాజకీయాల్లో దుమారం రేగుతోన్న తరుణంలో ఆమె ప్రెస్ మీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పేరు మార్పుపై మాత్రం ఆమె స్పందించలేదు. చరిత్రలను ఎవరూ చెరిపేయలేరని, ఇప్పటితరం అప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవాలని.. తాను పదవి కావాలని ఎన్టీఆర్ ను ఎప్పుడూ అడగలేదని, టెక్కలి నుంచి పోటీ చేయాలని అప్పట్లో తనను ప్రజలు కోరారని తెలిపారు. తన వివాహం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని విమర్శించారు. చంద్రబాబుకు తమ పెళ్లంటే ఇష్టం లేదని, మీడియా ముందే ఎన్టీఆర్ తనను పెళ్లి చేసుకున్నారని లక్ష్మిపార్వతి చెప్పారు. తమ పెళ్లి గురించి మాట్లాడితే ఈ సారి కేసు పెడతానని లక్ష్మిపార్వతి హెచ్చరించారు. అప్పట్లో ఎన్టీఆర్ టెక్కలి సీటు ఇస్తానన్నా తాను వద్దన్నానని చెప్పారు. ఎన్టీఆర్ భార్య కంటే పెద్ద పదవి లేదని తాను రాజకీయాలు స్వీకరించలేదన్నారు.

publive-image

మరోవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్లు, కూడళ్లలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. పోలీసులు వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు