/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/crime--jpg.webp)
Lady Selling Ganja in Hyderabad: హైదరాబాద్ లో పోలీసులు చేపట్టిన డెకాయ్ ఆపరేషన్ లో తాజాగా గంజాయి దందా బయటపడింది. ఈ వ్యవహారం అంతా కొన్ని సంవత్సరాలుగా నీతూబాయి అనే మహిళ సాగించడం విశేషం. గతంలో ఆమెపై పీడీ చట్టం ప్రయోగించినా, ఏడాది పాటు జైల్లో ఉంచినా కూడా ఆమె ఏ మాత్రం మారలేదని అంటున్నారు. ఇందులో భాగంగా.. జైలు నుంచి విడుదలైన తర్వాత తిరిగి గంజాయి దందా కొనసిగిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
Also Read: ప్రణీత్ రావు అరెస్టులో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు..!
సిద్దిపేటలో తీగ లాగితే నానక్ రాం గూడ డొంక మొత్తం కదిలిందనట్లు తెలుస్తోంది. నానక్‌రామ్ గూడలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లకు గంజాయి అమ్ముతున్న లేడీ డాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతి రోజు 20 లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని అమ్ముతున్నట్లు తెలుస్తోంది. గంజాయి అమ్మకం ద్వారా లేడీ డాన్ వందల కోట్ల రూపాయల సంపాదించిందని సమాచారం.
Also Read: మనీప్లాంట్, తులసి మొక్కలు అక్కడ పెడుతున్నారా? అయితే, జాగత్ర..!
నీతూబాయితో సహా పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఇంట్లో భారీ ఎత్తున గంజాయితో పాటు రూ.16 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆమెపై మరోసారి పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు హైదరాబాద్ పోలీసులు నివేదిక రూపొందించారని తెలుస్తోంది.