/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Lack-of-water-in-the-body-causes-laziness.jpg)
Laziness:నేటి కాలంలో ఎంత కష్టపడినా.. సమయానికి నిద్ర పట్టదు. దీనివల్ల ఉదయం లేవటం ఇబ్బందిగా ఉంటుంది. ఏ పనీ చేయాలనే ఫీలింగ్ రాకపోవటం, రోజంతా పడుకోవడం, అప్పుడప్పుడు జరిగినా ఫర్వాలేదు కానీ.. నిత్యం జరుగుతూనే ఉంటే మాత్రం అప్రమత్తంగా ఉండాలి. నిరంతర సోమరితనం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మనం ఏది తిన్నా అది నేరుగా మన శరీరంపై ప్రభావం చూపుతుంది. మీరు జంక్, ప్రాసెస్డ్ ఫుడ్, అనారోగ్యకరమైన కొవ్వు వంటివి ఎక్కువగా తింటే మీరు నీరసంగా, అలసిపోతారని నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆరోగ్యకరమైన కొవ్వు, సమతుల్య ఆహారాన్ని వీలైనంత ఎక్కువగా చేర్చుకోవాలి. దీనివల్ల రోజంతా మీరు ఎనర్జిటిక్ గా ఉంటారు.
నీటి కోరత వల్ల సోమరితనం వస్తుదా..?
- శరీరంలో నీరు లేకపోవడం వల్ల నీరసంగా అనిపిస్తుంది. దీన్నే డీహైడ్రేషన్ బాధితులుగా మారడం అంటారు. శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు రక్తం చిక్కబడడం ప్రారంభమవుతుంది. పోషకాలు కణాలకు చేరవు. అయితే శరీరంలో నీటి కొరత కారణంగా.. తిమ్మిరి, కండరాల నొప్పికి సంబంధించిన సమస్యలు వస్తాయి. అందుకే కడుపునిండా ఆహారం తినాలి, నీళ్లు ఎక్కువగా తాగాలి అంటారు. అంతేకాకుండా నిద్ర లేకపోవడం వల్ల అనేక రోగాల బారిన పడుతున్నారు. ఉదయాన్నే బద్ధకంగా అనిపించవచ్చు. రాత్రిపూట కనీసం 7-8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి:వయస్సును బట్టి ఎన్ని గంటలు వ్యాయామం చేయాలి? WHO ఏం చెబుతోంది?