టై బ్రేక్‌లో ప్రజ్ఞానందను కార్ల్‌సెన్‌ ఎలా ఓడించాడంటే?

ఫిడే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత ఆటగాడు ప్రజ్ఞానంద 1.5-0.5తో టై బ్రేక్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సెన్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. నార్వేజియన్ సూపర్ స్టార్ కార్ల్‌సెన్ దశాబ్దానికి పైగా క్రీడలో ప్రపంచ చెస్ ఆటగాళ్లో అగ్రస్థానంలో ఉన్నాడు. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్ విజేత అయిన కార్ల్‌సెన్‌కు ఇదే తొలి ప్రపంచ కప్ టైటిల్ కావడం విశేషం. ప్రపంచకప్‌ ఫైనల్ గేమ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.

New Update
టై బ్రేక్‌లో ప్రజ్ఞానందను కార్ల్‌సెన్‌ ఎలా ఓడించాడంటే?

ఆద్యంతం ఉత్కంఠభరితం.. 

ఫిడే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత ఆటగాడు ప్రజ్ఞానంద 1.5-0.5తో టై బ్రేక్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సెన్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. నార్వేజియన్ సూపర్ స్టార్ కార్ల్‌సెన్ దశాబ్దానికి పైగా క్రీడలో ప్రపంచ చెస్ ఆటగాళ్లో అగ్రస్థానంలో ఉన్నాడు. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్ విజేత అయిన కార్ల్‌సెన్‌కు ఇదే తొలి ప్రపంచ కప్ టైటిల్ కావడం విశేషం. ప్రపంచకప్‌ ఫైనల్ గేమ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.

ప్రజ్ఞానందను కార్ల్‌సెన్‌ ఎలా ఓడించాడంటే..

టైబ్రేక్‌లో మొదట ఒక్కో ఆటగాడికి 25 నిమిషాల చొప్పన తొలి రెండు ర్యాపిడ్ గేమ్‌లు నిర్వహించారు. గేమ్‌ సాగుతున్నా కొద్దీ ప్రజ్ఞానంద కాస్త వెనకబడ్డాడు. 14 ఎత్తులు ముగిసే సరికి ఇద్దరు చెరో బిషప్‌ కోల్పోయి సమానంగానే ఉన్నారు. అయితే నల్ల పావులతో ఆడిన కార్ల్‌సెన్ మెరుగ్గా ఆడితే.. తెల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే 16వ ఎత్తులో నైట్‌(గుర్రాన్ని) కోల్పోయిన ప్రజ్ఞాకు ఆ తర్వాత ఎత్తు వేసేందుకు 6 నిమిషాల 34 సెకన్లు పట్టింది. తర్వాత 32వ ఎత్తు ముగిసే సరికి ఇద్దరు ఆటగాళ్లు సమంగా ఉన్నారు. అయితే చివరగా 3 నిమిషాల టైం ఉండగా కార్ల్‌సెన్ స్పీడ్ పెంచడంతో.. ప్రజ్ఞానంద తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. మొత్తానికి 47వ ఎత్తులో ఓటమిని అంగీకరించక తప్పలేదు.

తొలిసారి వరల్డ్‌కప్‌ గెలిచిన కార్లెసెన్..

ఈ విజయంతో మాగ్నస్ కార్ల్‌సన్‌ తొలిసారి వరల్డ్‌కప్‌ ట్రోఫీ ముద్దాడాడు. దీంతో 1.1 లక్షల యూఎస్ డాలర్లు (భారత్ కరెన్సీలో సుమారు రూ.90.9 లక్షలు) గెలుచుకోగా.. రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానందం 80 వేల డాలర్లు (సుమారు రూ.66.13 లక్షలు) అందుకున్నాడు. టోర్నీ మొత్తం ప్రైజ్‌ మనీ రూ.15.13 కోట్లుగా ఉంది.

ఓటమి కాదు.. విజయమే..

ఫిడే చెస్ వరల్డ్ కప్ ఫైనల్‌లో ప్రజ్ఞానందకు నిరాశే ఎదురైనా ఇది ఓటమి కింద భావించకూడదు.. ఎందుకంటే 18ఏళ్ల కుర్రాడు.. టీనెజ్‌ కూడా దాటని వయసులో ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ని గట్టి పోటినిచ్చాడంటే అది చిన్నవిషయం కాదు. పదేళ్ల వయసులోనే ఈ చెస్‌ ప్రాడిజీని ప్రపంచం గుర్తించింది. పదేళ్ల వయసులో అంతర్జాతీయ మాస్టర్‌గా మారాడు ప్రజ్ఞానంద. విమెన్ గ్రాండ్ మాస్టర్, ఇంటర్నేషనల్ మాస్టర్ అయిన ఆర్‌.వైశాలికి తమ్ముడు ప్రజ్ఙానంద. 2016లో పదేళ్ల, పది నెలల, పంతొమ్మిది రోజుల వయసులో యంగెస్ట్ ఇంటర్నేషనల్ మాస్టర్‌గా కిరీటాన్ని పొందాడు ప్రజ్ఞానంద.

16ఏళ్ల వయస్సులో ఫిబ్రవరి 2022లో జరిగిన ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో ర్యాపిడ్ గేమ్‌లో అప్పటి ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. ప్రజ్ఞానంద ఆగస్టు 10, 2005న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. అతని తండ్రి, రమేష్‌బాబు, TNSC బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్, అతని తల్లి నాగలక్ష్మి గృహిణి, తరచుగా జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్‌లకు అతనితో పాటు వచ్చేవారు. చెన్నైలోని వేలమ్మాళ్ మెయిన్ క్యాంపస్‌కు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి:

ప్రజ్ఞానందది ఓటమి కాదు.. గెలుపే.. ట్విట్టర్ రియాక్షన్స్!

కార్ల్‌సెన్‌ని గడగడలాడించిన ప్రజ్ఞానంద.. కానీ ప్చ్‌.. ఓటమి.. బ్యాడ్‌లక్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు