Kadapa: ముద్దనూరు అల్లర్ల ఘటనపై సీరియస్ యాక్షన్ తీసుకున్న కర్నూలు రేంజ్ డీఐజీ.!

ముద్దనూరు సీఐ నరేష్ పై శాంతి భద్రతల వైఫల్యం కారణంగా బదిలీ వేటు పడింది. కడప వీఆర్ కి అటాచ్ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ ఆదేశాలు జారీ చేశారు. నిన్న ముద్దనూరులో టీడీపీ, వైసీపీ ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడులు చేసుకున్న సంగతి తెలిసిందే.

Kadapa: ముద్దనూరు అల్లర్ల ఘటనపై సీరియస్ యాక్షన్ తీసుకున్న కర్నూలు రేంజ్ డీఐజీ.!
New Update

Kadapa - Muddanur Issue: నిన్న కడప జిల్లా జమ్మలమడుగులోని ముద్దనూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్న సంగతి తెలిసిందే. టీడీపీ, వైసీపీ ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడులు చేసుకున్నారు. పోలీసుల ముందే కుర్చీలు, కర్రలు, రాళ్లతో రువ్వుకుని ఘర్షణకు దిగారు. అంతేకాదు శశిధర్ రెడ్డి (Shashidhar Reddy) ఇంటిలో ఉన్న టీడీపీ నాయకులపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి (MLA Sudheer Reddy) అనుచరులు దాడులకు పాల్పడ్డారు. ఆయన కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో దాదాపు 20 మందికి పైగా గాయలయ్యాయి. 

Also Read: Paytmపై ఆర్బీఐ చర్యలు.. ఇప్పుడు మనం ఏమి చేయాలి?

కాగా, ఈ అల్లర్ల ఘటనపై పోలీస్ బాస్ సీరియస్ అయ్యారు. శాంతి భద్రతల వైఫల్యం కారణంగా ముద్దనూరు సీఐ నరేష్ పై బదిలీ వేటు పడింది. ముద్దనూరు సీఐ నరేష్ ను కడప వీఆర్ కి అటాచ్ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఈ గొడవకు కారణం ముద్దునూరు వైసీపీ ఇంఛార్జ్ ముని రాజారెడ్డి తమ్ముడు శశిధర్ రెడ్డి ఇటీవల టీడీపీలో (TDP) చేరడమే. కాగా ఆయన అనుచరులు సైతం టీడీపీ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

Also Read: రామ్ చరణ్ RC16 లో నటించే అవకాశం.. ఆడిషన్స్ జరిగేది ఇక్కడే

ఈ నేపథ్యంలో శశి చేరికను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గం అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది. దీంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడగా సమాచారం అందుకున్న పోలీసులు ముద్దనూరులో భారీగా మోహరించారు. ఈ విషయం తెలుసుకున్న జమ్మలమడుగు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ భూపేష్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ఆయన్ను అడ్డుకుని పీఎస్‌కు తరలించారు.

#andhra-pradesh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe