AP: కర్నూలు టీడీపీ నేత మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్..!

కర్నూలు జిల్లా పత్తికొండ టీడీపీ నేత వాకిటి శ్రీను హత్య వెనుక సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనను సొంత పార్టీ నేతలే హత్య చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సహకార పరపతి సంఘం చైర్మన్‌ రేసులో ఉన్న శ్రీహరికి ఆ పదవి దక్కకుండా ఇలా చంపేశారని తెలుస్తోంది.

New Update
AP: కర్నూలు టీడీపీ నేత మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్..!

Kurnool: ఉమ్మడి కర్నూలు జిల్లాలో హత్య రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. ఆధిపత్యం కోసం సొంత పార్టీ నేతలే హత్యలు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. మొన్న బొమ్మిరెడ్డి పల్లెలో టీడీపీ కార్యకర్త గిరినాథ్ చౌదరి, నిన్న వైసీపీ కార్యకర్త సుబ్బరాయుడు.. నేడు టీడీపీ నాయకుడు శ్రీనివాస్ దారుణ హత్యలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.

Also Read:  పంద్రాగస్టు పండగ.. పదకొండోసారి ఎర్రకోట పై జెండా ఎగరేయనున్న ప్రధాని మోదీ 

కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగిన రాజకీయ హత్య వెనుక సంచలన నిజాలు బయటికొస్తున్నాయి. టీడీపీ నాయకుడి హత్యకు పార్టీలో గ్రూప్ వార్ కారణమని తెలుస్తోంది. టీడీపీ నేత వాకిటి శ్రీనును సొంత పార్టీ నేతలే హత్య చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఉదయం పత్తికొండ మండలం హోసురులో టీడీపీ మాజీ సర్పంచ్‌ భర్త వాకిటి శ్రీను దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన అతడిని కళ్లలో కారం కొట్టి, వేటకొడవళ్లతో నరికి చంపారు.

Also Read: నేడు ఏపీ వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభం

సహకార పరపతి సంఘం చైర్మన్‌ రేసులో ఉన్న వాకిటి శ్రీనుకు పదవి రాకుండా చేసేందుకు హత్య చేశారని తెలుస్తోంది. హోసూరు టీడీపీలో ఆధిప్యత పోరు వల్లే హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో పోలీసుల అదుపులో ఉన్న ఐదుగురిలో నలుగురు టీడీపీ నేతలే ఉండటం గమనార్హం. శ్రీను ఫోన్‌కాల్స్‌పై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు