Kurnool: 'అమ్మా.. నిన్ను చూడాలి'.. గుక్కపట్టి ఏడ్చిన చిన్నారి.. కర్నూలులో గుండెలు పిండేసే దృశ్యం.!

కర్నూలు జిల్లాలో హృదయవిదారక దృశ్యం కనిపించింది. చోరీ కేసులో రిమాండ్‌పై ఓ మహళను సబ్ జైలుకు తరలించారు. తల్లి ఎందుకు జైలుకు వెళ్లిందో తెలియని ఆ చిన్నారి అమ్మని చూడాలంటూ జైలు ముందు గుక్కపట్టి ఏడ్చింది. ఈ ఘటనను చూసిన స్థానికులు చిన్నారిని చూసి కంటతడి పెట్టుకుంటున్నారు.

Kurnool: 'అమ్మా.. నిన్ను చూడాలి'.. గుక్కపట్టి ఏడ్చిన చిన్నారి.. కర్నూలులో గుండెలు పిండేసే దృశ్యం.!
New Update

Also Read: ఎన్నికల మీద ఫుల్ ఫోకస్ పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు..నేతలకు టార్గెట్లు ఫిక్స్

కర్నూలు రూరల్ తహసీల్దారు కార్యాలయం ప్రాంగణంలోని మహిళా సబ్ జైలు ఎదుట హృదయవిదారక దృశ్యం కనిపించింది. ఓల్డ్ సిటీకి చెందిన ఓ మహిళను చోరీ కేసులో పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఆమెను మహిళ సబ్ జైలులో ఉంచారు. అయితే, ఆ మహిళకు ఏడేళ్ల చిన్నారి ఉంది. తల్లి కనిపించకపోవడంతో దిగులు పెట్టుకుంది. తల్లి ఎందుకు జైలుకు వెళ్లిందో..ఎందుకు తనకు దూరంగా ఉందో తెలియని ఆ చిన్నారి అమ్మను చూడాలంటూ జైలుకు వెళ్లింది. జైలు బయట నిలబడి  అమ్మా.. అని పిలుస్తూ వెక్కి వెక్కి ఏడ్చింది. పాపను ఓదార్చలేక బంధువులు సైతం తల్లడిల్లి పోయారు.


అక్కడే ఉన్న స్థానికులు చిన్నారి బాధను చూసి చలించిపోయారు. జైలు అధికారులతో మాట్లాడి ఆ చిన్నారికి తల్లిని కలిసే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మానవతాదృక్పథంతో జైలు అధికారులు ఆ తల్లిని మరోసారి బయటకు పిలిపించారు.. కూతురిని కలిసేలా చేశారు. ఆ తర్వాత జైలు అధికారులు కుమార్తెను బంధువులకు అప్పగించారు.

#andhra-pradesh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe