AP: బెట్టింగ్ కు బానిసై రూ.2 కోట్లు అప్పు చేసిన కొడుకు.. ప్రాణాలు తీసుకున్న పేరెంట్స్!

నంద్యాల జిల్లా అబ్దుల్లాపురంలో విషాదం చోటుచేసుకుంది. బెట్టింగ్ కు బానిసైన కొడుకు చేసిన రూ. 2.40 కోట్ల అప్పు తీర్చలేక తల్లిదండ్రులు ప్రాణాలు తీసుకున్నారు. 10 ఎకరాల భూమి, ఇల్లు, కల్లం అమ్మేసినా కూడా అప్పులు తీరకపోవడంతో పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

New Update
AP: బెట్టింగ్ కు బానిసై రూ.2 కోట్లు అప్పు చేసిన కొడుకు.. ప్రాణాలు తీసుకున్న పేరెంట్స్!

Kurnool: డిగ్రీ చదువు కోసమని కొడుకును బెంగళూరుకు పంపిస్తే అతడు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు బానిసై చివరికి తల్లిదండ్రుల ప్రాణాలను బలి తీసుకున్నాడు. ఈ విషాదకరమైన ఘటన నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురంలో చోటుచేసుకుంది. కొడుకు చేసిన 2 కోట్ల 40 లక్షల అప్పు తీర్చలేక తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. అసలేం జరిగిందంటే..

Also Read: కొడుకును పణంగా పెట్టి…భగత్‌సింగ్‌ ను కాపాడిన బాబీ!

మహేశ్వర్‌రెడ్డి, ప్రశాంతిలకు ఒక్కగానొక్క కొడుకు నిఖిల్‌ రెడ్డి. డిగ్రీ చదువు కోసం కొడుకును తల్లిదండ్రులు బెంగళూరుకు పంపించారు. అయితే, కొడుకు నిఖిల్‌రెడ్డి మాత్రం ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు బానిసైయ్యాడు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల్లో భారీగా డబ్బులు పొగొట్టుకున్నాడు. అంతేకాకుండా దాదాపు 2 కోట్ల 40 లక్షల అప్పులు చేశాడు.

Also Read: కోలకత్తా డాక్టర్ రేప్.. అర్థరాత్రి దేశ వ్యాప్తంగా నిరసనలు

విషయం తెలుసుకున్న నిఖిల్‌ రెడ్డి తల్లిదండ్రులు కొడుకు చేసిన అప్పుల కోసం 10 ఎకరాల భూమి, ఇల్లు, కల్లం అమ్మేశారు. అయితే, అప్పులు మాత్రం ఇంకా తీరలేదు. ఉన్న మరో 3 ఎకరాలు కూడా అమ్మేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. అయితే, తక్కువ ధరకు అడగడంతో మహేశ్వర్‌ రెడ్డి కలత చెందాడు. దీంతో అప్పులు తీర్చే దారి లేక మనస్థపం చెంది పొలంలోనే పురుగుల మందు తాగి నిఖిల్‌ రెడ్డి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు