Hanuma Vihari Issue Updates: దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆంధ్ర క్రికెట్ గురించే చర్చ. ఇకపై ఆంధ్ర క్రికెట్‌కు ఆడనంటూ టీమిండియా టెస్టు ప్లేయర్, ఏపీ ఆటగాడు హనుమ విహారీ ప్రకటించడం సంచలనం రేపింది. ఈ రంజీ సీజన్ సమయంలో మధ్యప్రదేశ్‌పై మ్యాచ్ తర్వాత విహారీని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) కెప్టెన్సీ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఓ ఆటగాడితో గొడవ కారణంగా.. అతనిచ్చిన ఫిర్యాదుతో ఏసీఏ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇదే విషయాన్ని విహారీ సైతం స్పష్టం చేశాడు. అతనో రాజకీయ నేత కుమారుడని.. జట్టులో 17వ ఆటగాడంటూ విహారి చెప్పుకొచ్చాడు. కేవలం రాజకీయ ఒత్తిడిల వల్లే ఏసీఏ నిర్ణయం తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశాడు. విహారిపై కంప్లైంట్ ఇచ్చిన ఆ రాజకీయ నేత కుమారుడు ఎవరో ఇప్పుడు క్లియర్‌కట్‌గా అర్థమైపోయింది. అతని పేరు కె.ఎన్. పృథ్వీరాజ్.
నువ్వు ఇంతకుమించి ఏమీ పీకలేవు:
కుంట్రపాకం పృధ్వీరాజ్ ఆంధ్ర జట్టు వికెట్ కీపర్. అతను తిరుపతిలో వైసీపీకి చెందిన ఓ వార్డు కార్పొరేటర్ తండ్రి అంటూ ప్రచారం జరుగుతోంది. ఇకపై ఆంధ్ర క్రికెట్‌కు ఆడనంటూ విహారి స్టేట్‌మెంట్ ఇచ్చిన కాసేపటికే పృధ్వీరాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రియాక్ట్ అయ్యాడు. మీరు వెతుకుతున్న మనిషిని నేనే అంటూ మెసేజ్ మొదలుపెట్టాడు. ఆట కంటే ఎవరూ ఎక్కువ కాదని విహారికి చురకలంటించాడు. పర్శనల్‌గా అబ్యూజ్ చేయడం ఎలాంటి ఫ్లాట్‌ఫారమ్‌లోనైనా కరెక్ట్ కాదన్నాడు పృధ్వీరాజ్. 'అభ్యంతరకర భాషను ఎవరూ సహించరు. ఆ రోజు ఏం జరిగిందో అందరికీ తెలుసు. నువ్వు ఇంతకుమించి ఏమీ పీకలేవు మిస్టర్ సో కాల్డ్ ఛాంపియన్.. ఈ సింపతీ గేమ్స్ ఎన్ని కావాలనుకుంటే అన్ని ఆడుకో..' అని స్టేటస్ పెట్టాడు.
1 Vs 15:
మరోవైపు ఆంధ్ర క్రికెట్ టీమ్‌లోని మిగిలిన ఆటగాళ్లు మాత్రం విహారికి మద్దతుగా నిలుస్తూ ఏసీఏ సీఈవోకి లేఖ రాశారు. ఆ రోజు విహారి తప్పు లేదని.. అతను మాట్లాడిన భాష సాధారణమేనంటూ లేఖలో పేర్కొన్నారు. మొత్తం 15మంది ఆటగాళ్లు సైన్ చేసిన లేటర్‌ను ఏసీఏ(ACA)కి పంపడం విశేషం. ఈ లెటర్ మేటర్ బయటకు వచ్చినా కాసేపటికే పృధ్వీరాజ్ విహారిపై విరుచుకుపడ్డాడు. ఇంతకన్నా ఏం పీకలేవ్ అంటూ రాసుకొచ్చాడు. ఇతనే ఒక్కడే ఒకవైపు.. మిగిలిన ప్లేయర్లంతా మరోవైపు ఉన్నారు. మరి తాజా పరిణామాలపై ఏసీఏ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
Also Read: ఇకపై ఆంధ్రకు ఆడను.. ఆ రాజకీయ నేతే కారణం.. హనుమ విహారి సంచలనం!
WATCH: