KTR: కామారెడ్డి జిల్లాకు విదేశీ పరిశ్రమలు తీసుకొస్తాం

కామారెడ్డి జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డి జిల్లాలో పర్యటించిన కేటీఆర్‌.. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన రహదారులను, సెంట్రల్ లైటింగ్‌ను, రోడ్డు డివైడర్లను ప్రారంభించారు.

KTR: కామారెడ్డి జిల్లాకు విదేశీ పరిశ్రమలు తీసుకొస్తాం
New Update

Foreign Industries to Kamareddy:  కామారెడ్డి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (IT Minister KTR) అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా నియోజకవర్గ కేంద్రంలో మంత్రి పర్యటించారు. అక్కడ 28 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆరులైన్ల రహదారులను, సెంట్రల్ లైటింగ్‌ను, రోడ్డు డివైడర్లను మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంపా గోవర్దన్ రెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి మాట్లాడుతూ.. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ 45 కోట్ల రూపాయలను కేటాయించారన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 28 కోట్ల రూపాయలతో రోడ్డు డివైడర్లును, స్వాగత తోరణాలను, సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు. రానున్న రోజుల్లో కామారెడ్డి జిల్లా అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

రాష్ట్రంలో హైదరాబాద్‌, వరంగల్‌ లాంటి పెద్ద నగరాల తర్వాత అభివృద్ధి చెందుతున్న జిల్లాగా కామారెడ్డి ఉందన్నారు. విదేశీ పరిశ్రమలు కామారెడ్డి జిల్లాకు పెట్టుబడులు పెట్టేందుకు సైతం ముందుకు వచ్చేలా తయారు చేస్తామన్నారు. అదే లక్ష్యంతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ముందుకు వెళ్తున్నారన్నారు. కామారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని వెల్లడించారు. కామారెడ్డిని అభివృద్ధి చేయాలని గంపా గోవర్దన్ రెడ్డి సీఎం కేసీఆర్‌ను కోరగా.. సీఎం (CM KCR) వెంటనే అభివృద్ధి కార్యక్రమాల కోసం 28 కోట్లు రూపాయలను మంజూరు చేశారన్న ఆయన తాను మరో 25 కోట్ల రూపాయలను నేడే (సోమవారం) విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు.

మరోవైపు పట్టణంలో మున్సిపల్ డిపార్ట్‌మెంట్‌ రోడ్లు, స్టేడియం కోసం, అంతర్గత రహదారుల కోసం సీఎం మరో 20 కోట్లు మంజూరు చేయబోతున్నారని వివరించారు. మంత్రి కేటీఆర్ ప్రభుత్వ విప్‌పై ప్రశంసలు కురిపించారు. సౌమ్యుడైన గంప గోవర్ధన్ కామారెడ్డి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి, జిల్లా కేంద్రంగా మార్చి, కలెక్టర్, ఎస్పీ కార్యలయాలు, మెడికల్ కళాశాల, సువిశాల రోడ్డు తదితర అభివృద్ధి పనులు చేస్తున్నారన్నారు. ఇలాంటి నేత ఉంటే నియోజకవర్గాలు త్వరగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.

రోడ్డు మార్గాన కామారెడ్డి జిల్లాకు వెళ్లిన కేటీఆర్‌ ముందుగా ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌కు వెళ్లారు. అక్కడ 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకున్న అనంతరం అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో ప్రజలు, కళాకారులు, మెకానిక్‌లు, బీఆర్ఎస్‌ శ్రేణులు పాల్గొన్నారు. వారు కేటీఆర్‌కు అడుగడుగునా స్వాగతం పలికారు.

Also Read: స్పీడ్ పెంచిన టీకాంగ్రెస్.. అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం!

#ktr #kamareddy #kamareddy-news #it-minister-ktr #premhara #vemu-prashant-reddy #gampa-gowardon-brs #ktr-at-kamareddy #ktr-meeting-in-kamareddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe