MLA KTR: నేను విచారం వ్యక్తం చేస్తున్న: కేటీఆర్

TG: మహాలక్ష్మి పథకంపై మహిళలను ఉద్దేశిస్తూ తాను చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. తన వ్యాఖ్యల వల్ల మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని అన్నారు.

KTR : తెలంగాణలో మేము గెలిచే సీట్లు ఇవే.. లెక్కలతో సహా వెల్లడించిన కేటీఆర్!
New Update

MLA KTR: తెలంగాణ రాష్ట్ర మహిళలను క్షమాపణలు చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నిన్న కార్యకర్తల సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. దీనిపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. మహిళలపై బీఆర్ఎస్ నేతలకు ఉన్న గౌరవం ఇదేనా కేటీఆర్?.. మీ నాన్న కేసీఆర్ నీకు నేర్పిన సంస్కారం ఇదేనా?అంటూ మండిపడ్డారు. అలాగే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆయన స్పందించారు.

నా ఉద్దేశం అది కాదు..

కేటీఆర్ ట్విట్టర్ (X)లో... "నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు." అని అన్నారు. ఇదిలా ఉంటే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి బీఆర్ఎస్ పార్టీని చిక్కుల్లో పడేశాయి. ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టడం బీఆర్ఎస్ నేతలకు ఇష్టం లేదని.. వాళ్లకు కడుపు మంటగా ఉందని అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

బస్సుల్లో రికార్డింగ్ డ్యాన్సులు...

బస్సుల్లో మహిళలు ఎల్లిపాయల పొట్టు తీసుకుంటే తప్పేం ఉందని మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైరికల్ గా స్పందించారు. ఇప్పుడు ఆ సెటైర్లే కేటీఆర్ ను యావత్ తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పేలా చేసింది. అసలు కేటీఆర్ ఏం అన్నారు?... కేటీఆర్ మాట్లాడుతూ .. " బస్సులో అల్లం ఎల్లిపాయ పొట్టు తీస్తే తప్పేం లేదు అక్క.. కానీ దానికోసమే బస్సు పెట్టిర్రు అని తెలియక ఇన్ని రోజులు మేం మాములుగా నడిపినం.. మాకు తెలవకపాయె పాపం... మీరు అప్పుడే చెప్తే బాగుండు.. ఎక్కువ పెట్టు బస్సులు.. బస్సులు ఎక్కువ సంఖ్యలో లేక తన్నుకుంటుర్రు.. మంచిగా లేదు.. పెట్టు మనిషికి ఒక బస్సు పెట్టు మేమెందుకు వద్దు అంటాము. కుటుంబం కుటుంబం మంచిగా కుట్లు, అల్లికలు.. అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేస్తారు' అని వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.

#ktr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe