KTR: డిప్యూటీ సీఎం భట్టికి కేటీఆర్ విజ్ఞప్తి...

తదుపరి విడత అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ని వీలైనంత త్వరగా విడుదల చేయాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్కని కోరారు మాజీ మంత్రి కేటీఆర్. కేసీఆర్ ప్రభుత్వం నుండి 7,000 మందికి పైగా తెలంగాణ విద్యార్థులు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పొందారని తెలిపారు.

New Update
KTR : కేటీఆర్‌పై చర్యలకు ఈసీ ఆదేశం!

Former Minister KTR: మాజీ మంత్రి కేటీఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు USAలో చదవుతున్న రవి అనే విద్యార్థి ఒక ట్విట్ చేశారు. ట్విట్ లో ఆ విద్యార్ధి తాను ప్రస్తుతం USAలో మాస్టర్స్ డిగ్రీ చదవుతున్నట్లు తెలిపారు. తాను షెడ్యూల్డ్ కుల సంఘానికి చెందినవాడిని పేర్కొన్నారు. తన చదువు కోసం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ తీసుకున్నట్లు కూడా తెలిపారు. అయితే, తనకు రెండోసారి స్కాలర్‌షిప్ రాలేదని.. అందువల్ల తన కాలేజీ ఫీజు చెల్లించడానికి ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.

అయితే, ఈ ట్విట్ పై ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. తదుపరి విడత అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ని వీలైనంత త్వరగా విడుదల చేయాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్కని కోరారు. SC/ ST/ BC/ మైనారిటీ, EBC నేపథ్యానికి చెందిన దాదాపు 7,000 మందికి పైగా తెలంగాణ విద్యార్థులు కేసీఆర్ ప్రభుత్వం నుండి ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పొందారని తెలిపారు. ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisment
తాజా కథనాలు