KTR: టీవీ, సోషల్ మీడియా ఛానళ్లకు కేటీఆర్ లీగల్ నోటీసులు.. లిస్ట్‌ ఇదే!

టీవీ, యూట్యూబ్‌ ఛానెల్స్‌తో సహా పలు ఫేస్‌బుక్‌ పేజీలపై కేటీఆర్‌ వార్‌ ప్రకటించారు. తమ పార్టీపై అసత్యాలను ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలకు లీగల్‌ నోటీసులు పంపుతున్నారు. తాజాగా మరో 9 మీడియా సంస్థలకు నోటీసులు పంపారు. లిస్ట్‌ కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
KTR: టీవీ, సోషల్ మీడియా ఛానళ్లకు కేటీఆర్ లీగల్ నోటీసులు.. లిస్ట్‌ ఇదే!

KTR Sends Legal Notices to Media Channels: టీవీ, యూట్యూబ్‌, సోషల్‌మీడియా ఛానెల్స్‌పై కేటీఆర్‌ యుద్దమే ప్రకటించారు. ముందుగా ట్విట్టర్‌లో హెచ్చరికలతో మొదలు పెట్టిన కేటీఆర్‌.. ఆ తర్వాత ముందుగా 16 డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్‌లకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఇక అంతటితో ఆ నోటిసుల పర్వం ఆగలేదు. ఈ సారి ఏకంగా పలు టీవీ ఛానెల్స్‌కే లీగల్‌ నోటీసులు పంపారు కేటీఆర్‌.

జాబితాలో ఉన్న టీవీ, యూట్యూబ్‌, సోషల్‌మీడియా ఛానెల్స్‌ లిస్ట్‌ ఇదే:

Mahaa News

iNews

Cr Voice

Mana Tolivelugu TV

Manam TV

Poly Tricks

Revanth Dandu

Wild Wolf News

Red TV

ఈ టీవీ ఛానెల్స్‌, యూట్యూబ్‌ ఛానెల్స్‌, ఫేస్‌బుక్‌ పేజీలకు చెందిన లింకులను కూడా జతపరిచారు. ఏ వార్తలకు నోటిసులు ఇచ్చారో పొందుపరిచారు. బీఆర్‌ఎస్‌ వర్గాల ప్రకారం వారి పార్టీపై కొన్ని మీడియా సంస్థలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా థంబ్‌నెయిల్స్‌ విషయంలో కేటీఆర్‌ ఆగ్రహంగా ఉన్నారని సమాచారం.

'గతంలో మాపై అసత్య ప్రచారాలను, అవాస్తవాలను ప్రసారం చేసిన, ప్రచురించిన మీడియా సంస్థలపైన కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించాము. ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ఈ దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాము. అసత్యాలను అదేపనిగా ప్రచారం చేసి, అడ్డమైన తంబునెల్స్ తో వార్తల పేరిట ప్రాపగండకు పాల్పడుతున్న యూట్యూబ్ ఛానళ్లపైన పరువు నష్టం కేసులు నమోదు చేయడంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాము. దీంతోపాటు ఆయా యూట్యూబ్ ఛానళ్లను నిషేధించాలని యూట్యూబ్ కి అధికారికంగా ఫిర్యాదు కూడా చేస్తాము..' అని మార్చి 24న కేటీఆర్‌ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Also Read:  హలీమ్‌ పేమెంట్‌ విషయంలో రచ్చ.. కస్టమర్‌ని ఎలా చితకబాదారో చూడండి!