KTR: ముదిరాజ్‌లకు పదవులపై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు.. మంత్రి ఏం అన్నారంటే..!

తెలంగాణలో ముదిరాజు కులస్తులకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు మంత్రి కేటీఆర్‌. కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ సభలో మాట్లాడిన కేటీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ముదిరాజులకు ఎమ్మెల్సీ,ఇతర నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు.

KTR: ముదిరాజ్‌లకు పదవులపై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు.. మంత్రి ఏం అన్నారంటే..!
New Update

కేసీఆర్‌(KCR)పై ఎవరు పోటీ చేసినా డిపాజిట్లు గల్లంతేనన్నారు మంత్రి కేటీఆర్‌. అఖండ మెజార్టీ ఇవ్వండని ప్రజలను కోరారు. మూడో సారి గెలిచి దక్షిణ భారత దేశంలోనే కేసీఆర్ కొత్త రికార్డు సృష్టించనున్నారని చెప్పారు. దేశంలోనే కేసీఆర్‌కు అత్యధిక మెజారిటీ రావాలని తెలిపారు. కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ సభలో మాట్లాడిన కేటీఆర్‌.. దేశం, రాష్ట్రమంతా కామారెడ్డి వైపు చూస్తోందన్నారు. 2004లో పొత్తులో భాగంగా కామారెడ్డి సెగ్మెంట్ కాంగ్రెస్‌కు అవకాశం వచ్చిందని.. కేసీఆర్ ప్రచారం చేస్తేనే షబ్బీర్ అలీ గెలిచారని తెలిపారు.

కేటీఆర్‌ ఇంకేం అన్నారంటే?

⁃ కామారెడ్డి తో ఉన్న అనుబంధం తోనే కేసీఆర్ ఇక్కడ పోటీ చేస్తున్నారు

⁃ కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఒక దృఢమైన ఆశయం ఉంటుంది.

⁃ కరువును తరిమి కొట్టేందుకే ఇక్కడి నుంచి పోటీ

⁃ ముదిరాజ్‌లకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తాం

⁃ ఎమ్మెల్సీ,ఇతర నామినేటెడ్ పదవులు ఇస్తాం

⁃ బూత్,గ్రామ కమిటీలను పటిష్టపర్చాలి

⁃ గ్రామ స్థాయి మేనిఫెస్టో రూపొందించాలి

⁃ వంద ఓట్లకు ఒక ఇంచార్జీ

⁃ మహారాష్ట్రలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు

ముదిరాజ్‌లకు పదవులు:
తెలంగాణలో మొత్తం 30లక్షల మంది ముదిరాజు కులస్తులు ఉన్నట్లు అంచనా. ముది రాజులు చెరువులలో చేపలు పెంచడం, ఆ తరువాత వాటిని అమ్ముకొని జీవిస్తున్నారు. కొంతమంది పండ్ల తోటల యాజమానుల దగ్గర వాటిని కౌలుకు తీసుకొని పండించి అమ్ముకోని జీవిస్తున్నారు. ఒకప్పుడు పోలీసు పటేల్‌ దగ్గర, గ్రామపంచాయతీలలో కావలి వాళ్లుగా అతి తక్కువ జీతాలకు పనిచేసేవారు ముదిరాజులు. అందుకే అప్పట్లో ముదిరాజులను కావలి వాళ్లు అని కూడా అనేవాళ్లు. ప్రత్యేకించి వీరికి ఒక కులవృత్తి అంటూ లేదు. కేటీఆర్‌ వీరికి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ,ఇతర నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు.

ALSO READ: ఈటల రాజేందర్‌ సంచలన హామి.. వారిలో ప్రతి ఒక్కరికీ 5 లక్షల రూపాయలు!

CLICK HERE TO VIEW RTV WHATSAPP CHANNEL

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe