KTR: 'సిగ్గుపడుతున్నాం..' గవర్నర్‌ ప్రసంగంపై అసెంబ్లీలో కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు!

అబద్ధాలు, అసత్యాలు చెబితే ఎవరూ నమ్మరంటూ గవర్నర్‌ తమిళిసై టార్గెట్‌గా కేటీఆర్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం విని సిగ్గుపడుతున్నామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ పాలన గురించి రేవంత్‌రెడ్డి గతంలో చాలాసార్లు విమర్శించారని చురకలంటించారు.

New Update
KTR: 'సిగ్గుపడుతున్నాం..' గవర్నర్‌ ప్రసంగంపై  అసెంబ్లీలో కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు!

అసెంబ్లీ వేదికగా గవర్నర్‌ తమిళి(TamiliSai)సై కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌ ప్రసంగంపై విరుచుకుపడ్డారు. తమిళిసై ప్రసంగానికి సిగ్గుపడుతున్నామని మండిపడ్డారు. 'కేవలం క్రెడిట్‌ మాత్రమే తీసుకుంటాం.. అన్యాయం గురించి మాట్లాడం అంటే కుదరదు' అంటూ కేటీఆర్‌(KTR) ఫైర్ అయ్యారు. 50 ఎకరాలు ఉన్న రైతైనా.. ఆనాడు హైదరాబాద్‌ వచ్చి గుంపుమేస్త్రీ పని చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. ఎక్కడ ఉన్నా ప్రజల కోసం గొంతు విప్పుతామని కేటీఆర్‌ తెలిపారు.

కేటీఆర్‌ ఏం అన్నారంటే:
--> అసెంబ్లీలో ఎక్కడున్నా.. మేం ప్రజలు పక్షమే.
--> తొలి రోజే కాంగ్రెస్‌ ఇంత ఉలికిపడితే ఎలా?
--> మేం 50ఏళ్ల విధ్వంసంపై మాట్లాడొద్దా?
--> అబద్ధాలు, అసత్యాలు చెబితే ఎవరూ నమ్మరు- కేటీఆర్‌
--> తొలి రోజే కాంగ్రెస్‌ సభ్యులు ఇంత ఉలికి
--> మూడు నెలల ఆగితే కాంగ్రెస్‌ అట్టర్‌ఫ్లాప్‌ అవుతుందని మా అధినేత చెప్పారు.

--> గత కాంగ్రెస్‌ పాలనలో బొంబాయి, బొగ్గుబాయి, దుబాయే ఉండేవి.
--> గత కాంగ్రెస్‌ పాలనలో ఆకలికేకలు, ఆత్మహత్యలు.
--> కాంగ్రెస్‌ నేతలు ఆనాడు పదవుల కోసం.. పెదవులు మూసుకున్నారు.
--> మందబలంలో ఉన్నామని మాట్లాడితే కరెక్ట్ కాదు.
--> ఇందిరమ్మ పాలన గురించి రేవంత్‌రెడ్డి గతంలో చాలాసార్లు విమర్శించారు.

ఇక కేటీఆర్‌ వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రులు భట్టి, పొన్నం ప్రభాకర్‌ కౌంటర్లు ఇచ్చారు. ధన్యవాద తీర్మానంలో దాడిచేసినట్టు మాట్లాడడం సరికాదన్నారు. విపక్షాలు ఏ సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామన్నారు. నిర్మాణాత్మక సూచనలిస్తే తీసుకుంటామని చెప్పారు. మిగులు బడ్జెట్‌తో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే పదేళ్లలో అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు భట్టి. అటు పొన్నం ప్రభాకర్‌ సైతం కేటీఆర్‌పై రివర్స్‌ అటాక్‌కు దిగారు. 2014కు ముందు అన్యాయం జరిగిందనే.. తెలంగాణ కోసం కొట్లాడామని చెప్పుకొచ్చారు.
ALSO READ: ముంబై జెర్సీ తగలబెట్టిన రోహిత్‌ అభిమాని.. ట్విట్టర్‌లో వెల్లువెత్తుతున్న నిరసనలు!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు