Yedla Rahul: లోక్ సభ ఎన్నికల వేళ కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈరోజు మైనంపల్లి హనుమంతరావుతో కలిసి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు కేటీఆర్ బామ్మర్ది ఎడ్ల రాహుల్ రావు. కండువా కప్పి రాహుల్‌ను పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్‌రెడ్డి. కేటీఆర్ సతీమణి శైలిమా చిన్నమ్మ కొడుకే ఈ ఎడ్ల రాహుల్. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అదికారంలో ఉన్న రోజుల్లో కేటీఆర్ కు ఎడ్ల రాహుల్ రైట్ హ్యాండ్ లాగా ఉండేవాడు. సొంత కుటుంబ సభ్యుడే పార్టీ ని వీడడం బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశమైంది.
ALSO READ: లిక్కర్ స్కాం కేసులో కవిత షాక్.. ఉచ్చు బిగిస్తున్న సీబీఐ
బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే రాజీనామా..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైరా టికెట్ ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకే ఇస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న రాములు నాయక్ కు ఎదురుదెబ్బ తగిలింది. తనకు కాకుండా బానోతు మదన్ లాల్ కు కేసీఆర్ టికెట్ కేటాయించారు. కాగా తనకు కాకుండా వేరే అతనికి టికెట్ కేటాయించడంపై అసంతృప్తిగా ఉన్న రాములు నాయక్ ఆరోజు నుంచే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. వైరాలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడానికి రాములు నాయక్ కూడా ఒక కారణం అని అక్కడ టాక్ కూడా నడిచింది. పార్టీ అసంతృప్తిగా ఉన్న రాములు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాషాయ సైన్యంలో సైనికుడు అయ్యేందుకు బీజేపీలో ఆయన చేరనున్నట్లు తెలుస్తోంది.