ఘనంగా కేటీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ప్రముఖుల శుభాకాంక్షలు

తెలంగాణ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. పేదలకు టమాటాలు పంచుతూ, రక్తదానం చేస్తూ తమ అభిమానం చాటుకుంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కేటీఆర్ బర్త్‌డే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

ఘనంగా కేటీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ప్రముఖుల శుభాకాంక్షలు
New Update

KTR Birthday

మెగాస్టార్ చిరంజీవి కూడా కేటీఆర్‌కు ట్విట్టర్ వేదికగా బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపారు. 'మై డియర్ బ్రదర్ తారక్... మీరు ఒక డైనమిక్ లీడర్. మేమంతా ఎంతో ప్రేమించే, ఆరాధించే స్నేహితుడు. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. స్ఫూర్తినిచ్చే మీ కలలు నిజమవ్వాలి. మీ ప్రయాణంలో మీరు వేసే ప్రతి అడుగుకు ఆశీర్వాదాలు ఉంటాయి. హ్యాపీ బర్త్ డే' అని ట్వీట్ చేశారు.

చిరుతో పాటు మహేష్, రామ్ చరణ్ , రవితేజ, గోపిచంద్ , సుధీర్ బాబు.. దర్శకులు అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని తదితరులు కేటీఆర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అభివృద్ధి పట్ల కేటీఆర్‌కున్న అభిరుచి అబినందనీయమని.. డైనమిక్ లీడర్‌గా భవిష్యత్తులో స్ఫూర్తివంతమైన జీవితం లభిచాలని సినీ ప్రముఖులు ఆకాంక్షించారు.

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అమీర్‌పేట్ సారధి స్టూడియోలో సినీ నటుడు అలీ మొక్క నాటారు.
ఈ సందర్భంగా మొక్కను నాటి మంత్రి కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలపడం ఆనందంగా ఉందన్నారు. మనం నాటిన మొక్కలు పెరిగి భవిష్యత్ తరాలకు మంచి ఆక్సిజన్ అందిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. అనంతరం హీరో శ్రీకాంత్, ఉత్తేజ్‌కి ఛాలెంజ్ చేశారు.

రాజ్య‌స‌భ ఎంపీ సంతోష్ కుమార్ కేటీఆర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. హ్యాపీ బ‌ర్త్ డే అన్న‌య్య అంటూ సంతోష్ ట్వీట్ చేశారు. మీతో కలిసి ఉన్న ప్ర‌తి జ్ఞాప‌కం త‌న హృద‌యానికి ద‌గ్గ‌రగా ఉంటుంద‌ని పేర్కొన్నారు. మీ అంకిత‌భావం, ద‌య‌, దూర‌దృష్టి గ‌ల నాయ‌క‌త్వం తామంద‌రికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంద‌న్నారు. దీనికి థాంక్యూ సంతూ అంటూ కేటీఆర్ రీట్వీట్ చేశారు.

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని బాలానగర్ డివిజన్ కార్పొరేరటర్ ఆవుల రవీందర్ రెడ్డి జీహెచ్ఎంసీ సిబ్బందికి టమాటాలు పంపిణీ చేశారు. బాలానగర్ టమాటా రేట్లు పెరిగిన నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా పంపిణీ చేశామని తెలిపారు. అనంతరం బాలానగర్ డివిజన్ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి ఆయన పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఐటీ మంత్రి కేటీఆర్‌కు ఆ పార్టీ నేత అలిశెట్టి అరవింద్ వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 12 అడుగుల ఎత్తు 45 అడుగుల వెడల్పు కలిగిన భారీ బస్సుకు ఇరువైపులా కేటీఆర్ సాధ్యంలో సాధించిన విజయాలను వివరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. టీ హబ్, దుర్గం చెరువు ఫ్లైఓవర్, టీ వర్క్స్, నగరంలోని పలు ఫ్లైఓవర్లను ఇందులో పొందుపరిచారు. దేశంలోనే తొలిసారి ఈ తరహా శుభాకాంక్షలు తెలిపిన నేతగా అలిశెట్టి చరిత్రలో నిలిచిపోనున్నారు. ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన ఈ వాహనం పది రోజులపాటు నగరంలోని వివిధ ప్రాంతాలలో తిరగనుంది. అతి తక్కువ కాలంలో అభివృద్ధి చేసి చూపించిన తమ నేత కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుని వేడుకుంటున్నట్లు అలిశెట్టి తెలిపారు.

publive-image

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe