హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా వరద నిలిచిపోవడంతో వాహనాలు బారులు తీరాయి. అటు నందిగామ(Nandigaama) దగ్గర హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నందిగామ బస్టాండ్‌లోనే ఆర్టీసీ బస్సులు ఉండిపోయాయి. ఇక గంటల తరబడి బస్సుల్లోనే ప్రయాణికుల ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తమను గమ్యస్థానాలకు చేర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇటు ఆర్టీసీ అధికారుల తీరుపై ప్రయాణికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు మున్నేరు, వైరా, కట్టలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సమీప గ్రామ ప్రజలను కలవర పెడుతోంది. దీంతో నార్కట్ పల్లి, మిర్యాలగూడ, దాచేపల్లి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా వైజాగ్ వెళ్ళాలని సూచిస్తున్నారు. మరోవైపు ఇవాళ కృష్ణా యూనివర్సిటీ(Krishna University)కి సంబంధించిన పరీక్ష ఉండడంతో పోలీసులు విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పరీక్ష కోసం పాట్లు:
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. గ్యాప్ ఇవ్వకుండా దంచికొడుతున్నాడు. కొన్ని ప్రాంతాల్లో వర్షం ఆగిపోయినా రోడ్డుపై వరద నీరు మాత్రం అలానే నిలిచి ఉంది. మరోవైపు ఇవాళ కృష్ణా యూనివర్సిటీకి సంబంధించిన చివరి పరీక్ష ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లోని అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల(kanchikacherla) మండలం గన్నేపల్లిలో నివాసముండే విద్యార్థులు నందిగామలో పరీక్ష రాయాల్సి ఉండగా.. హైవేపై భారీ స్థాయిలో వరద నిలిచిపోయింది. ఆ వరద నీరుకు వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి. దీంతో ఏం చేయాలో విద్యార్థులకు అర్థంకాలేదు.. ఇంతలోనే పోలీసులు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకున్నారు.. వాళ్లు ఎగ్జామ్ టైమ్‌కి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు
చాలా చాలా థ్యాంక్స్ :
పరీక్షకు వెళ్లడం సాధ్యం కాదని ఓవైపు విద్యార్థులు ఫుల్ టెన్షన్‌లో ఉండగా.. పోలీసులు(police) మాత్రం ఆఘమేఘాల మీద సొలూష్యన్ ఆలోచించారు. వెంటనే దాన్ని అమలు కూడా చేశారు. రహదారి మధ్యలో ఉన్న భీకర వరదను దాటేందుకు క్రేన్ల సాయం తీసుకున్నారు. రోడ్డుకు అవతల వైపు చిక్కుకున్న విద్యార్థులను క్రేన్లపై కూర్చొబెట్టి మరోవైపునకు సురక్షితంగా తీసుకెళ్లారు. వెంటనే అక్కడ నుంచి ఆటోలో విద్యార్థులు పరీక్ష హాల్‌కి చేరుకున్నారు. పోలీసులు ఇంత సాయం చేయడం పట్ల విద్యార్థులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలు పరీక్షకు వెళ్లలేమని అనుకున్నామని..చాలా బాధపడ్డామని.. ఇంతలోనే పోలీసులు ఈ విధంగా తమకు పరీక్ష సెంటర్లకు వెళ్లేలా చేయడం పట్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. పోలీసులకు స్పెషల్ థ్యాంక్స్ కూడా చెబుతున్నారు. మరోవైపు యూనివర్సిటీ సైతం ఎగ్జామ్ టైమ్‌కి అరగంట మినహాయింపునిచ్చింది. ఆలస్యంగా వచ్చినా కూడా పరీక్షకు అనుమతిచ్చింది.