/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/revathi-jpg.webp)
Krishna Mukunda Murari Serial: ఇంటి పెద్ద భవానీ కొడుకు ఆదర్శ్ కి ప్రేమగా అన్నం తినిపిస్తుంది. అంత సడెన్ గా జాబ్ కి ఎలా రిజైన్ చేశావని తనని అడుగుతుంది. ఆదర్శ్ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. కృష్ణ మాట్లాడుతూ.. రిస్క్ ఆపరేషన్స్ అంటే ముందు ఉంటున్నారట అత్తయ్య.. ఈయన దూకుడు వల్ల ఎక్కడ తను రిస్క్ లో పడతారోనని అడ్మినిస్ట్రేషన్ లో వేశారట అది నచ్చక రిజైన్ చేశారని చెబుతుంది.
తరువాత రేవతి భవానీ దగ్గరికి వచ్చి.. అక్కా.. సమస్యలన్నీ తీరిపోయాయి కదా.. ముకుంద కూడా ఆదర్శ్ తో కలిసిపోయిందని అంటుంది. అప్పుడే ఇంటి ముందు ఉన్న తులసి కోట దగ్గర ముకుంద, కృష్ణ ఇద్దరూ కలిసి పూజ చేస్తూ కనిపిస్తారు. వాళ్లిద్దరిని చూస్తూ రేవతి, భవానీ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. కేవలం కృషి వల్లే ఆదర్శ్ ఇంటికి వచ్చాడని..తన బ్రతుకుని పణ్ణంగా పెట్టి పోరాటం చేసిందని మెచ్చుకుంటుంది.
ఇదిలా ఉండగా, ఆదర్శ్, ముకుందకు ఇటు కృష్ణ, మురారి లకు శోభనం ఏర్పాట్లు చేయాలని రేవతి ప్లాన్ చేస్తోంది. ముహుర్తం పెట్టేందుకు పూజరిని ఇంటికి రమ్మని చెబుతోంది. అయితే, ముకుంద మాత్రం చాలా గందరగోళంలో ఉంటుంది. ప్రేమించిన వ్యక్తిని కళ్ల ముందు పెట్టుకొని మరచిపోలేకుంటుంది. భర్త ఆదర్శ్ ను అంగీకరించలేకపోతుంటుంది. ముకుంద మారినట్లు ఇంట్లో అందరూ అనుకుంటున్నారు. కానీ, మురారిని మర్చిపోలేక ఇంట్లో వాళ్లకు భర్త ఆదర్శ్ అంటే ఇష్టం లేదని చెప్పుకోలేక ముకుంద సతమతమవుతుంటుంది.