/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/mukundha-1-jpg.webp)
Krishna Mukunda Murari Serial: పెద్దత్తయ్య భవానికి ఇచ్చిన మాట ప్రకారంగా కృష్ణ, మురారి ఆదర్శ్ ను తిరిగి ఇంటికి తిసుకొస్తారు. ముకుంద నీకోసం ఎదురుచూస్తుందని..ఇంట్లో అందరూ నీ రాక కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారని కృష్ణ చెబుతుంది. దీంతో ఇంటికి రావడానికి ఆదర్శ్ ఒప్పుకుంటాడు. అతడి లగేజ్ అంత కృష్ణ సర్థిపెడుతుంది. ఎట్టకేలకు ముగ్గురు కలిసి ఇంటికి వెళ్తారు.
ఆదర్శ్ రాకతో సందడి
ఆదర్శ్ కారు దిగడం చూసి అందరూ ఎంతో హ్యాపీగా ఫీలవుతారు. ముఖ్యంగా పెద్దత్తయ్య భవాని ఎమోషనల్ అవుతుంది. కొడుకుని చూసి మురిసిపోతుంది. పూలతో అతడికి ఘనంగా స్వాగతం పలుకుతారు. ఇంట్లో అందరూ ఆదర్శ్ ను హగ్ చేసుకుని ప్రేమగా మాట్లాడుతారు. కానీ, ముకుందకు మాత్రం ఆదర్శ్ రాకతో అలజడి మొదలవుతంది. ఆదర్శ్ ను చూసి షాకింగ్ ఎక్స్ ప్రెషన్ పెడుతుంది. ఇంట్లో అందరికి మారినట్లు చెప్పినా..మనసులో లేని వ్యక్తితో ఎలా బ్రతకాలి? అని తనలో తాను మదనపడుతుంటుంది.
మదనపడుతోన్న ముకుంద
అయితే, ఇంట్లో అందరి అనుమానం ముకుందపైనే ఉంటుంది. ఆదర్శ్ రావడంతో అందరూ సంతోషంగా ఉన్నా.. ముకుంద ముఖంలో ఆ సంతోషం కనిపించడం లేదని ఇంట్లో అందరూ అనుకుంటూ ఉంటారు. నిజంగా ముకుంద మారిందా? మురారిని మరచిపోయి ఆదర్శ్ ను భర్తగా అంగీకరిస్తుందా? అని సీరియల్ అభిమానులు సైతం ఎంతో ఆస్తికరంగా చూస్తున్నారు. ముకుంద మారితే అప్పుడు కృష్ణ మురారి లఫ్ కు ఇక ఏ ఇబ్బంది ఉండదూ అని అనుకుంటున్నారు.
Also Read: రాజ్ శ్వేత రిలేషన్.. కావ్యకు క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్..!