Krishna Mukunda Murari Serial: ముకుంద ప్లాన్ సక్సెస్.. కృష్ణ, మురారి శోభనం క్యాన్సిల్..!

కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో కృష్ణ, మురారి శోభనం ఆగిపోతుంది. గదిలోకి వెళ్ళే టైమ్ కి ముకుంద ఏడుస్తూ ఒక మూలన ఉంటుంది. అది చూసిన కృష్ణ.. ముకుంద బాధపడుతుందని శోభనం ఆపేసుకుంటుంది. దీంతో, ముకుందా ఏ మాత్రం మారలేదని ప్లాన్ ప్రకారమే నటిస్తుందని క్లీయర్ గా అర్థమవుతుంది.

New Update
Krishna Mukunda Murari Serial: ముకుంద ప్లాన్ సక్సెస్.. కృష్ణ, మురారి శోభనం క్యాన్సిల్..!

Krishna Mukunda Murari Serial:  కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో ట్రై యాంగిల్ లవ్ స్టోరికి ముగింపు రావడం లేదు. ముకుంద మారినట్లు అందరి ముందు నటిస్తున్న నిజానికి తను ఏ మాత్రం మారలేదని అర్థమవుతుంది. అందుకే కృష్ణ మురారి శోభనం ఆగిపోయేలా నటిస్తుంది. అయితే, తింగరి కృష్ణ.. ముకుంద మారిందని గుడ్డిగా నమ్ముతుంది. కానీ, ముకుంద మాత్రం వారితో ప్రేమగా ఉంటునే ద్రోహం చేసేలా కనిపిస్తుందని సీరియల్ అభిమానులు ఫీల్ అవుతున్నారు.

publive-image

శోభనం క్యాన్సిల్..

అందరూ కృష్ణను అందంగా రెడీ చేసి శోభనం గదికి పంపించేందుకు వెళ్తూ ఉంటారు. అయితే, అప్పుడే కృష్ణ.. ముకుంద గురించి అడుగుతుంది. ముకుంద ఏమో ఓ మూలన నిలుచోని ఏడుస్తూ ఉంటుంది. దీంతో కృష్ణ.. ముకుంద బాధను అర్థం చేసుకుని శోభనం క్యాన్సిల్ చేస్తుంది. ఇంట్లో అందరూ షాక్ అవుతారు. మురారి అమ్మ.. కృష్ణను తిడుతుంది. కానీ, కృష్ణ ఏమో ముకుంద గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటుంది.

publive-image

నటిస్తోన్న ముకుంద..

ముకుంద భర్త ఆదర్శ్ తిరిగివస్తేనే మా జీవితాలు కూడా సంతోషంగా ఉంటాయని కృష్ణ చెబుతుంది. ఇందుకు మురారి కూడా ఒప్పుకుంటాడు. ముకుంద దగ్గరకు వెళ్లిన కృష్ణ శోభనం జరగడం లేదని చెబుతుంది. నా కోసం మీ సంతోషాన్ని దూరం చేసుకోకండని అంటుంది. అయితే, ముకుంద బయటికి అలా అన్న లోపల మాత్రం కావాలనే ఇలా శోభనం క్యాన్సిల్ అయ్యేలా ఏడుస్తూ నటించిందని ఇంట్లో వాళ్లు అనుకుంటారు.

publive-image

ఆదర్శ్ కోసం ప్రయత్నాలు

ఆదర్శ్ ను ఎలాగైనా తీసుకు వస్తానని మాటిస్తుంది. మురారితో కలిసి తనకు తెలిసిన ఆఫీసర్ల ద్వారా ఆదర్శ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తు ఉంటుంది. అయితే, ఆదర్శ్ వచ్చినా ముకుంద మారదని..మురారి, కృష్ణ కలిసి ఉండడం తనకు ఇష్టం లేకే ఇలా చేస్తుందని సీరియల్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఈ కృష్ణ అనవసరంగా ముకుందపై జాలీ చూపిస్తూ తన లైఫ్ ని డిస్టర్బ్ చేసుకుంటుందని అంటున్నారు.

Also Read: నేను చేసింది తప్పే.. ఆలస్యంగా తెలుసుకున్నా: సమంత పశ్చాత్తాపం

Advertisment
Advertisment
తాజా కథనాలు