Krishna Mukunda Murari: మురారి ఇంట్లో సంక్రాంతి పండుగ సందర్భంగా పూజలు నిర్వహిస్తారు. భవానీ దేవి కుటుంబం మొత్తం ఆ పండుగా హంగామాలోనే ఉంటుంది. పూజలతో, భోజనాలతో ఇంట్లో సందడి వాతవరణం మొదలవుతుంది. అయితే, పూజలో కొన్ని ఆటంకాలు కూడా ఎదురవుతాయి. సుమలత దేవుడికోసం పళ్లు తెస్తుంటే కాలు జారి కింద పడిపోతుంది. అంతేకాకుండా, ముకుంద చేతిలో హారతి పళ్లెం పెట్టి కృష్ణ హారతి తీసుకుబోతుండగా దీపం ఆరిపోతుంది. దీంతో అందరూ అపచారం అని ఫీల్ అవుతుంటారు.
ఆదర్శ్ వస్తేనే..
ఇదిలా ఉండగా హీరోయిన్ కృష్ణ, మురారీలు ముకుందా భర్త ఆదర్శ్ ఎక్కడ ఉన్నాడా? అని తెలుసుకోవడానికి తెగ ట్రై చేస్తుంటారు. తెలిసిన సేహ్నితుల ద్వారా అతడి ఆచూకి కోసం ఎంక్వైరి చేస్తుంటారు. ఆదర్శ్ రాక గురించి ఎంతగానో ఎదురు చూస్తూంటారు. ఆదర్శ్ వస్తే ముకుంద లైఫ్ బాగుంటుందని..భర్త దూరంగా ఉండటం వల్లే ప్రేమించిన మురారిని మర్చిపోలేక ముకుంద ఇలా తాయారు అయిందని కృష్ణ అనుకుంటుంది.
నిజంగా మారిందా?
మరోవైపు ముకుంద మారినట్లు ప్రవర్తిస్తుంటుంది. అయితే, తను నిజంగా మారిందా? లేదా? అనే అనుమానం కూడా కలుగుతుంటుంది. ఎందుకంటే, తన అన్న కూడా అంతే ప్రేమగా ఉంటూ అందరిని నమ్మించి మోసం చేశాడు. భర్త దూరంగా ఉండడంతో ముకుందకు ఏమీ చేయాలో తెలియని పరిస్థితి. పూజకు వచ్చినా పూజారి కూడా ముకుందను తన భర్తను తీసుకురమ్మని అడిగితే ఏమీ చెప్పలేక మదనపడుతుంటుంది. చూడాలి మరి, కృష్ణ ఆదర్శిని తీసుకుని ముకుంద కాపురాన్ని నిలబెడుతుందా? లేదా అనేది.
Also Read: రగిలిపోతున్న అనామిక.. శోభనం క్యాన్సిల్.. కావ్యే కారణమంటూ నిందలు