Krishna Mukunda Murari Serial: కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో హీరోయిన్ కృష్ణ (Krishna) ఏ తప్పు చేయలేదని తేలుతుంది. ఇంటి పెద్ద భవానీ తనను ఇంట్లోకి రానిచ్చేందుకు అంగీకరిస్తుంది. దీంతో ఫుల్ ఖుషి అవుతుంది కృష్ణ. ఇంట్లో అందరిని హగ్ చేసుకుని తెగ సందడి చేస్తోంది. ఎలాంటి తింగరి చేష్టలు చేయకుండా బుద్దిగా ఉండు అంటూ అత్త భవాన్ని హెచ్చరిస్తుంది.
ముకుందపై అనుమానం
ముకుంద (Mukunda) ఏమో అందరి ముందు తను పూర్తిగా మారిపోయినట్టుగా ప్రవర్తిస్తుంది. పొద్దున్నే లేచి ఇంట్లో అందరికి కాఫీ ఇస్తుంది. అందరిని మంచిగా పలకరిస్తుంది. అయితే, ముకుంద నిజంగానే మారిందా? లేదంటే నటిస్తుందా? అని ఇంట్లో అందరికి అనుమానం వస్తుంటుంది.
కశ్మీర్ టూ కన్యాకుమారి
ఇదిలా ఉండగా కృష్ణ ఫోటోస్ చూసి మురిసిపోతూ ఉంటాడు మురారి (Murari). ఇద్దరూ కాసేపు ప్రేమగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఏ అడ్డు లేదు కదా ..నువ్వు అన్నట్టు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్దామని కృష్ణతో అంటాడు. శోభనం ముహూర్తం పెట్టించమని అమ్మని అడిగేస్తానని అంటాడు. దీంతో కృష్ణ సిగ్గుపడుతూ.. నాముందే ఈ బిల్డప్ అత్తయ్య ముందు అడగలేరని కామెంట్ చేస్తుంది.
ప్రభాకర్ విడుదల కోసం ప్రయత్నాలు
పెద్దత్తయ్య భవానీ.. కృష్ణ చిన్నాన్నపెద్దపల్లి ప్రభాకర్ ను జైలు నుండి విడిపించేలా లాయర్ తో మాట్లాడుతుంది. ఏ తప్పు చేయని ప్రభాకర్ కూతురు కోసం జైలుకు వెళ్లాడు. బెయిల్ పై కాకుండా పూర్తిగా ఈ కేసు నుండి రిలీఫ్ కావాలని చెబుతుంది. తను ఏ హత్య చేయలేదు కాబట్టి ఈజీగా కేసు నుండి బయిటకు రావచ్చని లాయర్ అంటాడు. వారం రోజుల్లోగా ప్రభాకర్ జైలు నుండి బయటకి రావాలని అంటుంది.
కృష్ణ, మురారి అవుట్ హౌస్ కు వెళ్తారు. చిన్నమ్మతో మాట్లాడుతుండగా మురారి అమ్మ వస్తుంది. శోభనం ముహుర్తం అడగడటానికి ఇబ్బంది పడుతూ ఇన్ డైరెక్ట్ గా తన ఫ్రెండ్ కు మంచి ముహుర్తం కావాలమ్మ..ఎప్పుడున్నాయో తెలుసా? అంటాడు. కొడుకుని అర్థం చేసుకున్న తల్లి కావాలనే.. ఈ రెండు, మూడు నెలల్లో ముహుర్తాలే లేవని సరదాగా ఆట పట్టిస్తుంది.
Also Read: అత్తను రఫ్ఫాడిస్తున్న స్వప్న.. అప్పుకు యాక్సిడెంట్..షాక్ లో కావ్య..!