Krishna mukunda murari Serial: భర్తను మోసం చేస్తూ.. మురారి ఊహల్లో తేలిపోతున్న ముకుంద.. ఆదర్శ్ కు నిజం చెప్తుందా..?

ఆదర్శ్ ను భర్తగా యాక్సెప్ట్ చేయలేకపోతున్న ముకుంద.. వాలెంటైన్స్ డే కాంపీటీషన్ లో భర్త స్థానంలో మురారినే ఊహించుకొని డాన్స్ వేస్తుంది. మరో వైపు ముకుంద కప్ బోర్డులో మురారి ఫోటోలు చూసిన ఆదర్శ్ లో మళ్ళీ అనుమానం మొదలవుతుంది. ఇలా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

Krishna mukunda murari Serial: భర్తను మోసం చేస్తూ.. మురారి ఊహల్లో తేలిపోతున్న ముకుంద.. ఆదర్శ్ కు నిజం చెప్తుందా..?
New Update

Krishna mukunda murari Serial:  వాలెంటైన్స్ డే కాంపిటీషన్ కోసం కృష్ణ , మురారి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. అందరు రెడీగా హాల్లో కూర్చుంటారు. ఆదర్శ్ మాత్రం చూసిన ముకుంద, మురారిలా ఫోటోల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో నందు.. ఏదో సర్ ప్రైజ్ అన్నారు.. ఏంటది అని మురారిని అడుగుతుంది.

publive-image

మురారి.. ఐడియా మాత్రమే మాది . షో కాన్సెప్ట్ అంతా మధునే ప్లాన్ చేశాడని చెప్తాడు. ఇక మధు ప్రోగ్రాంలో ముందుగా డాన్స్ చేయాలనీ చెప్తాడు. దీని కోసం కృష్ణ, మురారిని తమకు ఇష్టమైన పాట ఏంటని అడుగుతాడు. దానికి కృష్ణ జలజల పాతం అని చెప్తుంది.

publive-image
వెంటనే మధు ఇప్పుడు ఈ పాటకు ఆదర్శ్, ముకుంద డాన్స్ చేస్తారు అని చెప్తాడు. ఇది వినగానే ముకుంద షాక్ అవుతుంది. సాంగ్ చెప్పింది కృష్ణ కదా.. మేము చేయడం ఏంటని మధును ప్రశ్నిస్తుంది. దానికి మధు ఎవరు చెప్పింది వాళ్ళు చేస్తే కిక్ ఏంటి.. అందుకే మీరు చేయాలని చెప్తాడు.

publive-image
ఇక తప్పదని భావించిన ముకుంద డాన్స్ వేయడానికి వెళ్తుంది. కానీ మురారినే మనసులో పెట్టుకున్న ముకుంద.. ఆదర్శ్ స్థానంలో మురారిని ఊహించుకుంటూ చాలా క్లోజ్ గా డాన్స్ చేస్తుంది.

publive-image
ఇది చూసి కృష్ణ, మురారి హ్యాపీగా ఫీల్ అవుతారు. కొడుకుతో ముకుంద క్లోజ్ గా డాన్స్ చేయడంతో భవానీ దేవి సంతోషంగా ఫీల్ అవుతుంది. కానీ ముకుంద మాత్రం.. నన్ను క్షమించు ఆదర్శ్.. నేను మురారినే తలుచుకొని మాత్రమే డాన్స్ వేశానని మనసులో అనుకుంటుంది.

publive-image
ఆ తరువాత కృష్ణ, మురారి ఒక స్కిట్ చేయమని చెప్తాడు మధు. భర్త తాగి ఇంటికి వస్తే భార్య ఎలా స్పందిస్తుందో చేసి చూపించాలని చెప్తాడు. అలాగే ముకుంద, ఆదర్శ్ కూడా ఇదే కాన్సెప్ట్ పెర్ఫార్మ్ చేయాలనీ చెప్తాడు. ఇక ముకుంద ఆదర్శ్ పై ఎంతో ప్రేమ ఉన్నట్లుగా ఈ స్కిట్ అద్భుతంగా చేస్తుంది. మురారి, కృష్ణ కూడా బాగా పెర్ఫార్మ్ చేస్తారు. ఆ తర్వాత రెండు జంటలు సూపర్ గా చేశారని ఇంట్లో అందరు క్లాప్స్ కొడతారు. ఇక చివరిలో.. ఎవరు బాగా చేశారో డిసైడ్ చేసేది పెద్దమ్మ అని అంటాడు మధు. కానీ తిరిగే చూసేసరికి భవాని దేవి అక్కడ ఉండదు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

Also Read: OTT Trending Movies: ఓటీటీలో టాప్ 3 ట్రేండింగ్ మూవీస్.. చివరిలో స్థానంలో ఆ సినిమానే..!

#krishna-mukunda-murari-serial
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe