Krishna Mukunda Murari serial: ముకుంద షాకింగ్ డెసిషన్.. భవానీ ఏం చేయనుంది..?

కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో దేవ్ అసలు దోషి అని తేలడంతో అతడి చెల్లి ముకుందని పెద్దత్త భవానీ ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని అంటుంది. కానీ, కృష్ణ అడ్డుకుని తనని ఇంట్లోనే ఉండేలా చేస్తుంది. నెక్ట్స్ డే ముకుంద తను అవుట్ హౌస్ లో ఉంటాను అత్తయ్య అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తుంది.

New Update
Krishna Mukunda Murari serial: ముకుంద షాకింగ్ డెసిషన్.. భవానీ ఏం చేయనుంది..?

Krishna Mukunda Murari serial: శ్రీధర్ ను హత్య చేసింది ముకుంద అన్న దేవ్ అని అందరికి తెలుస్తుంది. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు. ఇక ఇంటి కోడలివి నువ్వే కృష్ణ అని అత్త రేవతి సంతోషంగా అంటుంది. ముకుంద మాత్రం ఏడుస్తూ ఉంటుంది. పెద్దత్త భవానీ ముకుందని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని అంటుంది. కానీ, కృష్ణ అడ్డుకుని తనకు అండగా నిలబడుతుంది.

publive-image

Also Read: చిచ్చుపెట్టిన రుద్రాణి.. రెచ్చిపోతున్న ధాన్యలక్ష్మీ

ముకుందను క్షమించని భవానీ

పశ్చాత్తాపంతో ముకుంద కుమిలిపోతుంది ఒక్కసారి ఆలోచించండి పెద్దత్తయ్య అంటుంది కృష్ణ. కృష్ణ చెప్పినట్టు ముకుంద మారిందని చెప్తుంది కదా తను కూడా క్షమించమని అడుగుతుంది కదా ఒక్కసారి ఆలోచించండి పెద్దమ్మ అంటాడు మారారి.  క్షమించమని అడిగావ్ కానీ క్షమించను అని తేల్చి చెబుతుంది. కానీ, ముకుంద ఇంట్లో ఉండాలంటే భవిష్యత్ లో జరిగే పరిణమాలకు నువ్వే బాధ్యత వహించాలని అంటుంది. అందుకు కృష్ణ సరే అత్తయ్య అంటుంది.

ముకుంద షాకింగ్ డెసిషన్

ఈ రోజు ప్రొమో చూసినట్లు అయితే..ముకుంద పెద్దత్తయ్యతో మాట్లాడుతూ.. కృష్ణ చెయ్యని నేరానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అవుట్ హౌస్ లో ఉంది. తనకు ఈ ఇంట్లో ఉండేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. కావాలంటే నేను అవుట్ హౌస్ లో ఉంటాను అత్తయ్య అంటూ చెబుతుంది. దీంతో కృష్ణ షాక్ అవుతుంది. కానీ మురారి హ్యాపిగా ఫీల్ అవుతాడు.

publive-image

కృష్ణను భావని కోడలిగా అంగికరిస్తుందా?

పెద్దమ్మ ముకుంద చెప్పింది కరెక్ట్.  ఇక కృష్ణ అక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది అని మురారి అంటాడు. పెద్దత్తయ్య భవానీ మాత్రం ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది. అగ్రిమెంట్ మ్యారేజ్ కాబట్టి వాళ్లిద్దరికీ పెళ్లి చేసి ఇంట్లోకి కోడలిగా తీసుకోద్దామని అంటుందా? లేద మాములుగా కృష్ణను ఇంట్లోకి రమ్మని చెప్పి.. ముకుందను అవుట్ హౌస్ కు పంపిస్తుందా? అనేది తెలియాలి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు