Krishna Mukunda Murari Serial: కృష్ణ చిన్నాన్న నిర్దోషి అని నిరూపించేందుకు ఉన్న ఒకే ఒక్క ఆధారం ఆర్టిస్ట్ శ్రీధర్. అయితే, అతడిని దేవ్ హత్య చేస్తాడు. ఎట్టిపరిస్థితిలోనూ ముకుందా మురారి పెళ్లి జరగాలని..నిందితుడు తనే అని ఎవరు కనిపెట్టకుండా ఉండేందుకు ఆర్టిస్ట్ శ్రీధర్ ను ముకుందా అన్న దేవ్ హత్య చేస్తాడు. దీంతో, హీరో మురారి, హీరోయిన్ కృష్ణ హత్య చేసింది ఎవరా? అని కనిపెట్టే ప్రయత్నం చేస్తారు.
చనిపోయినప్పుడు ఆర్టిస్ట్ శ్రీధర్ తీసిన ఫొటోలను ఇద్దరూ పరిశీలిస్తు ఉంటారు. అయితే, అప్పుడూ హీరోయిన్ కృష్ణ ఆర్టిస్ట్ శ్రీధర్ ఫేస్ పై ఉన్న ఒక గుర్తును చూస్తుంది. అది మూరారికి చూపిస్తుంది. అది చూసిన మురారి.. శ్రీధర్ ను చంపే అప్పుడు హత్య చేసిన వ్యక్తి అతడిని పిడికిలి బిగించి కొట్టడం వల్ల నిందితుడి వేలుకు ఉన్న రింగ్ అచ్చు పడిందని అంటాడు. సో చంపిన వ్యక్తికి ఉన్న రింగ్ ఆధారం ద్వారా నిందితుడిని పట్టుకోవాలని అనుకుంటాడు.
ఇదిలా ఉండగా మరోవైపు నిందితుడు దేవ్ ఏమో ముకుందాకు ఎట్టి పరిస్థితిలోనూ మురారితో పెళ్లి చేస్తానని హామీ ఇస్తాడు. ముకుందా ఏమో పెళ్లి జరుగుతుందా? లేదా అని భయంతో ఉంటుంది. అందరూ కుటుంబ సమేతంగా బోజనం చేయడానికి కూర్చుంటారు. అప్పుడు దేవ్ కూడా వచ్చి తింటూ ఉంటాడు. అయితే, అప్పుడు కృష్ణ దేవ్ కు ఉన్న ఉంగరాన్ని గమినిస్తున్నట్లు ప్రొమో లో చూపించారు. త్వరలో హత్య చేసిన వ్యక్తి దేవ్ అని మురారి, కృష్ణ అని అర్థమవుతుంది.
Also Read: కావ్యపై దండయాత్ర.. కాఫీతో షాక్ ఇచ్చిన కొత్త కోడలు..అనామిక టార్గెట్ ఇదేనా..!