Sri Krishna Janmashtami Life Lessons : మత విశ్వాసాలు, హిందూ పురాణాల ప్రకారం కృష్ణుడిని శ్రీ మహావిష్ణువు అవతారంగా పరిగణిస్తారు. ప్రతి ఏడాది కృష్ణుడు అవతరించిన రోజును శ్రీకృష్ణ జన్మాష్టమి (Sri Krishna Janmashtami) గా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఆగస్టు 26 జన్మాష్టమి వేడుకలు జరుపుకోనున్నారు. వంటి విషయాలను నేర్పుతుంది. ప్రజల పట్ల శ్రీకృష్ణుడి రక్షణ, కరుణ, సున్నితత్వం, ప్రేమ పురాణాలలో గొప్పగా కీర్తించబడ్డాయి. కృష్ణుడి జీవితమంతా మానవాళికి ఒక పాఠంగా మిగిలిపోయింది. జన్మాష్టమి సందర్భంగా శ్రీ కృష్ణుని జీవితం నుంచి ఈ ఉత్తమ స్వభావాలను నేర్చుకోండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము..
నాయకత్వం
అర్జునుడికి శ్రీకృష్ణుడి మార్గనిర్దేశం విలువైన నాయకత్వ పాఠాలను భోదిస్తుంది. యుద్ధ సమయంలో కృష్ణుడి నిర్ణయాలు, వ్యూహాత్మక ఆలోచన, సవాళ్లు ఎదురైన సమయంలో ఆవేశ పడకుండా సంయమనం పాటించడం వంటి గొప్ప లక్షణాలు నాయకత్వానికి ఉదాహరణగా చెప్పబడతాయి.
సృజనాత్మక సమస్య-పరిష్కారం
మహాభారతం (Mahabharata) లో సందిగ్ధతల సమయాల్లో శ్రీకృష్ణుడు చేసిన తెలివైన పరిష్కారాలు, సృజనాత్మక సమస్య-పరిష్కారం, విమర్శనాత్మక ఆలోచనలు ఎంతో ప్రాముఖ్యతను చూపుతాయి. కృష్ణుడిలోని ఈ లక్షణాలు సమస్యను అన్ని వైపులా ఎలా ఆలోచించాలి, సమస్య ఎదురైనప్పుడు నైపుణ్యం ప్రదర్శించడం, తెలివైన పరిష్కారాలతో సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలి అనే విధానాలను నేర్పుతాయి.
బలహీనతనే బలంగా మార్చుకోవడం
ప్రతి ఒక్కరిలో కొన్ని లోపాలు, బలాలు ఉంటాయని శ్రీ కృష్ణుడి జీవితం నుంచి నేర్చుకోవాలి. అటువంటి పరిస్థితిలో, ఎదుటివారిలో లోపాలను చూసే బదులు వారి సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహించాలి.
ప్రశాంతత
కంసుడు తనను చంపాలనుకుంటున్నాడని శ్రీకృష్ణుడికి తెలుసు. అయినప్పటికీ కృష్ణుడు ప్రశాంతంగా ఉండి.. సమయం వచ్చినప్పుడు స్పందించారు. కావున... ఎలాంటి పరిస్థితిలోనైనా ప్రశాంతంగా ముందుకు వెళ్తే సమయమే మనకు అనుకూలంగా మారుతుంది. అలాగే సమస్యకు పరిష్కారం కూడా సులభంగా దొరుకుతుంది.
స్నేహం
శ్రీ కృష్ణుడి జీవితం గొప్ప స్నేహాన్ని నేర్పుతుంది. స్నేహితుడి ప్రతి కష్టంలో తోడుగా ఉండేవాడే నిజమైన స్నేహతుడిగా నిలుస్తాడనే గొప్ప సందేశాన్ని ఇస్తుంది. అవసరమైనప్పుడు శ్రీ కృష్ణుడు తన స్నేహితుడు అర్జునుడికి రథసారధి అయ్యాడు. తనకు యుద్ధంలో సహాయం చేశాడు.
ప్రేమ
కృష్ణుడు తన చుట్టూ ఉన్న ప్రజలపై ఎంతో ప్రేమ, కరుణ, దయతో ఉండేవారు. గోకులలోని తన ప్రజలకు ఎల్లప్పుడూ రక్షగా నిలిచేవారు. కృష్ణుడిలోని ఈ లక్షణాలు మానవత్వ లక్షణాలు, మనుషుల పట్ల ప్రేమను భోదిస్తాయి.