Sri Krishna Janmashtami 2024 : శ్రీ కృష్ణాష్టమి రోజున ఈ 4 వస్తువులను దానం చేయండి

హిందూ మతంలో ప్రతీ ఏడాది కృష్ణాష్టమిని వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 26న జన్మాష్టమిని జరుపుకోనున్నారు. అయితే ఈ ప్రత్యేకమైన రోజున అన్నదానం, వెన్నదానం, వస్త్రదానం, నెమలి ఈకల దానం చేయడం వల్ల అదృష్టం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

New Update
Sri Krishna Janmashtami 2024 : శ్రీ కృష్ణాష్టమి రోజున ఈ 4 వస్తువులను దానం చేయండి

Donate These Things On Janmashtami : ప్రతి సంవత్సరం, హిందూ క్యాలెండర్‌ (Hindu Calendar) లోని ఆరవ మాసమైన భాద్రపద కృష్ణ పక్ష అష్టమి తేదీని శ్రీకృష్ణుని జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. మత విశ్వాసాలు, పురాణాల ప్రకారం శ్రీ కృష్ణుడు ఈరోజున జన్మించారని నమ్ముతారు. అందుకే ఈరోజును జన్మాష్టమిగా జరుపుకుంటారు. ప్రజలు.. భజనలు, కీర్తనలు, పూజలతో శ్రీ శ్రీకృష్ణుడిని ఆరాధిస్తారు. అయితే జన్మాష్టమి రోజున ఈ నాలుగు వస్తువులను దానం చేయడం ద్వారా అదృష్టం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాము

అన్నదానం చేయడం

కృష్ణ జన్మాష్టమి (Sri Krishna Janmashtami)  రోజున దానధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. అన్నదానం చేస్తే తరగని ఫలాలు లభిస్తాయని నమ్ముతారు. ఎందుకంటే అన్ని దానాలలో అన్నదానం గొప్పదిగా పరిగణించబడుతుంది.

వెన్న దానం

శ్రీకృష్ణుడికి వెన్న ఎంతో ప్రీతికరమైనది. జ్యోతిషశాస్త్రంలో, ఇది శుక్ర గ్రహానికి సంబంధించినది. అందుకని జన్మాష్టమి నాడు వెన్న దానం చేస్తే శుక్ర దోషం తొలగిపోతుంది.

నెమలి ఈకను దానం చేయడం
శ్రీకృష్ణుని తలపై  నెమలి తప్పక ఉంటుంది. అందుకని జన్మాష్టమి నాడు నెమలి కిరీటాన్ని దానం చేయడం వల్ల శ్రీకృష్ణుడి దయతో సమస్యలు తొలగిపోతాయి. అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం

వస్త్రదానం

ప్రతి వ్యక్తి జీవితంలో ఆహారం, బట్టలు, ఉండడానికి ఒక గూడు కావాలని కోరుకుంటారు. కావున ఈ ప్రత్యేకమైన రోజున వస్త్రదానం చేయడం కూడా మంచిది. దీని వల్ల కృష్ణుడి అనుగ్రహం పొందుతారని, పేదరికం కూడా దూరమవుతుందని చెబుతారు.

Also Read: Sri Krishna Janmashtami : శ్రీకృష్ణుడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు.!

Advertisment
తాజా కథనాలు