Vallabhaneni Vamsi Arrest News: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం అని కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి గన్నవరంలోని తన ఇంటికి వచ్చిన వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ స్పందించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ఇద్దరు అనుచరులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వంశీ అనుచరులైన రమేష్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ కోర్టు విధించింది. ఇక మరో అనుచరుడు రౌడీ షీటర్ యూసఫ్ పఠాన్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
అతడిని రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీ A-71గా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. ఈ రోజు ఉదయం నుంచి వంశీని ఈ కేసులో అరెస్ట్ చేశారంటూ జోరుగా వార్తలు వచ్చాయి.
హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తుండగా వంశీ వాహనాన్ని పోలీసులు వెంబడించి అరెస్ట్ చేసినట్లు మీడియా కథనాలు వచ్చాయి. వంశీని అరెస్ట్ చేయలేదని ఎస్పీ ప్రకటించడంతో ఆ వార్తలకు బ్రేక్ లు పడ్డాయి. అయితే.. వల్లభనేని వంశీ మాత్రం ఈ అంశంపై ఇంత వరకు స్పందించలేదు.
Also Read: ఆర్చరీ మిక్స్‌డ్ సెమీ ఫైనల్‌కు ధీరజ్ బొమ్మదేవర-అంకిత భకత్!