మీ అజమాయిషీ పనికిరాదు..మంత్రి కొట్టు సత్యనారాయణ సీరియస్..!!

ఇంద్రకీలాద్రిపై పోలీసులు, రెవెన్యూ, ఎండోమెంట్ అధికారుల సమన్వయలోపం పై మంత్రి కొట్టు సత్యనారాయణ సీరియస్ అయ్యారు. భోజనాలు, దర్శనాలు అంశాల విషయంలో అధికారుల అజమాయిషీ విషయమై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వివక్ష లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు జరగాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సీపీ, కలెక్టర్లకు కొట్టు సత్యానారాయణ నోట్ పంపారు.

New Update
మీ అజమాయిషీ పనికిరాదు..మంత్రి కొట్టు సత్యనారాయణ సీరియస్..!!

Kottu Satyanarayana:  ఇంద్రకీలాద్రిపై పోలీసులు, రెవెన్యూ, ఎండోమెంట్ అధికారుల సమన్వయలోపం పై మంత్రి కొట్టు సత్యనారాయణ సీరియస్ అయ్యారు. భోజనాలు, దర్శనాలు అంశాల విషయంలో అధికారుల అజమాయిషీ విషయమై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వివక్ష లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు జరగాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే సిపి, కలెక్టర్లకు మంత్రి కొట్టు సత్యనారాయణ నోటు పంపారు. వీఐపీ మార్గం అంటే టికెట్టు లేకుండా వెళ్ళే మార్గం అయిపోయిందని మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. వీఐపీ టికెట్టు దర్శనం పై కూడా ఒక నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.

Also Read: చంద్రబాబుకు ఏమైనా జరిగితే భువనేశ్వరిపైనే అనుమానం: నారాయణస్వామి

కిందిస్ధాయి పోలీసు సిబ్బంది సమస్యలు కలిగిస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు సంబంధించిన వారిని మాత్రమే దర్శనానికి పంపడం ఇబ్బందికరంగా మారిందని ఫైర్ అయ్యారు. పోలీసుల విషయమై ఒక నోట్ కూడా సీపీకి పంపిస్తునన్నాంటూ మంత్రి వెల్లడించారు. సమన్వయం తప్పిన అధికారుల విషయమై ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్, సీపీ లకు చెబుతానంటూ వ్యాఖ్యనించారు.ఇవాళ అమ్మవారు లలితా త్రిపురసుందరీ దేవి గా దర్శనం ఇస్తున్నారని..నిన్న 2 లక్షలు మంది భక్తులు దర్శనం చేసుకున్నారని మంత్రి తెలిపారు. అధికారుల సమన్వయంతో నిన్న కార్యక్రమం అద్భుతంగా జరిగిందన్నారు.

publive-image

ఈ క్రమంలోనే భక్తులకు సదుపాయాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. ఇప్పటి వరకూ 5.8 లక్షల మంది దర్శనం చేసుకున్నరన్నారు. ఉగ్రరూపంలో దర్శనం చేసుకున్న వారు.. శాంత రూపంలో దర్శనం చేసుకోవాలనుకుంటారని తెలిపారు. సోమవారం కూడా 2 లక్షలకు పైబడి భక్తులు వస్తారని అంచనా వేశారు.భోజనాలు పెట్టడం విషయం లో ఇక్కడ భోజనాలు పెట్టకూడదు అని పోలీసులు అన్నారని..అయితే సదరు పోలీసు అధికారి విషయంలో సీపీ తో మాట్లాడుతానని ప్కేరొన్నారు. ఎండోమెంట్ అధికారులు కూడా బాధ్యతగా కలిగి ఉండాలని.. ఇది మన ఇంటి పండుగని సూచించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు